Amarnath Yatra- Big Tunnel: చుట్టూ ముళ్ల పొద.. అనుమానంతో చెక్ చేస్తే షాకింగ్ సీన్.. అలర్ట్ అయిన జవాన్లు..!

Amarnath Yatra- Big Tunnel: మరోమారు పాకిస్థాన్‌ ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి బీఎస్‌ఎఫ్ బృందాలు. త్వరలోనే జరగబోయే అమరనాథ్‌ యాత్రను..

Amarnath Yatra- Big Tunnel: చుట్టూ ముళ్ల పొద.. అనుమానంతో చెక్ చేస్తే షాకింగ్ సీన్.. అలర్ట్ అయిన జవాన్లు..!
Tunnel
Follow us
Shiva Prajapati

|

Updated on: May 06, 2022 | 6:10 AM

Amarnath Yatra- Big Tunnel: మరోమారు పాకిస్థాన్‌ ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి బీఎస్‌ఎఫ్ బృందాలు. త్వరలోనే జరగబోయే అమరనాథ్‌ యాత్రను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు పనిన్ని పన్నాగం గుట్టు రట్టు చేశాయి భద్రతా దళాలు. జమ్మూకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఓ రహస్య సొరంగాన్ని గుర్తించారు. సాంబా జిల్లాలోని చాక్‌ ఫఖీరా బోర్డర్‌ అవుట్‌పోస్ట్‌కు సమీపంలో 150 మీటర్ల సొరంగం ఉన్నట్లు గుర్తించారు బీఎస్‌ఎఫ్‌ అధికారులు. ఈ సొరంగాన్ని ఇటీవలే తవ్వారని, పాక్‌ భూభాగం నుంచే ఈ సొరంగం ఉన్నట్లు బీఎస్‌ఎఫ్‌ డీఐజీ ఎస్‌పీఎస్‌ సంధు తెలిపారు.

అవుట్‌పోస్ట్‌కు కేవలం 300 మీటర్ల దూరంలోనే ఈ సొరంగం ఉన్నట్లు తెలిపారు. ఈ సొరంగం నుంచి మన దేశంలోని చివరి గ్రామానికి దూరం కేవలం 700 మీటర్లే ఉన్నట్లు గుర్తించారు. అమర్‌నాథ్‌ యాత్రకు భంగం కలిగించేందుకు ముష్కరులు ఈ సొరంగం నుంచి భారత భూభాగంలోకి చొరబడేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు అనుమానించారు. ఇకపోతే, 2017లో అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సుపై లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జూన్‌ 30 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు మూడింతల నిఘాపెట్టింది.