Japanese PM: భారత్‌లో పర్యటిస్తున్న జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా.. పలు కీలక అంశాలపై ఇరు దేశాల చర్చలు..

|

Mar 20, 2023 | 1:07 PM

జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా రెండు రోజుల భారత్ పర్యటన నిమిత్తం ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్నారు.

Japanese PM: భారత్‌లో పర్యటిస్తున్న జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా.. పలు కీలక అంశాలపై ఇరు దేశాల చర్చలు..
Japanese PM meets PM Modi
Follow us on

జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఇవాళ దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో జపాన్ ప్రధానికి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజీవ్ చంద్రశేఖర్ తెల్లటి పంచలో కనిపించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించేందుకు కిషిదా పర్యటన చక్కటి అవకాశం. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా పర్యటనకు చాలా ప్రాముఖ్యత ఉంది. మార్చి 2022లో భారత్- జపాన్ మధ్య జరిగిన చివరి శిఖరాగ్ర సమావేశం నుంచి ఢిల్లీ , టోక్యో వరుసగా G20, G7 దేశాలకు అధ్యక్షత వహించాయి. దీంతో జపాన్ ప్రధాని ఈసారి భారత పర్యటనకు ప్రముఖ్యత సంతరించుకుంది. అలాగే, ఇండో-పసిఫిక్‌లో కొత్త ప్లాన్‌ను ప్రకటించే అవకాశం ఉంది. పెరుగుతున్న అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడానికి ఇరు దేశాలు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ప్రధాని మోదీతో జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా చర్చలు జరపనున్నారు.

రెండు దేశాల మధ్య భాగస్వామ్యం రక్షణ, భద్రత, వాణిజ్యం,పెట్టుబడి, విద్య, ఆరోగ్య సంరక్షణ,  అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు వంటి బహుళ రంగాలలో ఉంటుంది. కిషిదా భారతదేశ పర్యటన సందర్భంగా, ఆహారం, ఆరోగ్య భద్రత, శక్తి పరివర్తనలు, ఆర్థిక స్థిరత్వం వంటి ముఖ్యమైన ప్రపంచ సవాళ్లపై ఆసక్తులను కలిపేందుకు రెండు దేశాలు పని చేయవచ్చు.

గురువారం విలేకరుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. భారత్‌కు జపాన్ చాలా ముఖ్యమైన భాగస్వామి దేశమని అన్నారు.  గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ లో పర్యటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయవార్తల కోసం