Jammu Srinagar Highway: కొండచరియలు విరిగి బండరాళ్లు పడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసేశారు. మరోవైపు మంచు (snowfall) కూడా భారీగా పడుతుండటంతో అటువైపు వాహనాలు వెళ్లకుండా స్థానిక యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటోంది. దేశంలోని మిగతా ప్రాంతాలను కశ్మీర్‌తో కలిపే ఏకైక మార్గం ఇదే కావడంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం జమ్మూ కశ్మీర్‌లో భారీ హిమపాతానికి తోడు పలు ప్రాంతాలల్లో కొండచరయిలు (landslides) విరిగి పడ్డాయి. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై పెద్దపెద్ద బండరాళ్లు పడ్డాయి. మెహర్ ప్రాంతంలో హైవే మీదకు ఓ భారీ రాయి దొర్లింది. దీంతో ఈ మార్గంలో దార్ నుంచి శ్రీనగర్ వైపు వెళుతున్న ఓ ట్రక్ ప్రమాదానికి గురైంది. ఆ రాయిని ట్రక్ ఢీ కొనడంతో డ్రైవర్ గాయపడ్డాడు. పోలీసులు, స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు..
నిన్నటినుంచి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై అనేక చోట్ల కొండచరియలు, బండరాళ్లు పడటంతో ఈ మార్గం ప్రమాదకరంగా మారింది. దీంతో 270 కిలో మీటర్ల పొడవైన ఈ జాతీయ రహదారిని అధికారులు మూసేశారు. దేశంలోని మిగతా ప్రాంతాలను కశ్మీర్‌తో అనుసంధానించే ఏకైక మార్గం ఇదే.. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వారికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. చాలా చోట్ల గంటల తరబడి ట్రాఫిక్ జామ్స్ తలెత్తాయి.
మరోవైపు జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో భారీ హిమపాతం కురుస్తోంది. శ్రీనగర్‌లోలో మైనస్ 1.8 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతోంది. పహల్గామ్‌లో మైనస్ 0.8, గుల్మార్గ్ మైనస్ 7.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్గన్‌టాప్ మీదుగా వార్వాన్‌కు వెళుతున్న ఆరుగురు గల్లంతు కాగా వారిని 48 గంటల తర్వాత రక్షించారు. వీరిని రక్షించేందకు ఆర్మీతో పాటు ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
Also Read: