Congress Vs BJP: కొత్త పార్లమెంట్‌ భవనంపై రచ్చ రచ్చ.. కాంగ్రెస్ నేత జైరాం రమేష్‌కు నడ్డా, గిరిరాజ్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్..

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అనంతరం ‘కొత్త పార్లమెంట్‌ భవనం’పై రచ్చ మొదలైంది.. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్‌ జాతీయ రాజకీయాల్లో దుమారం రేపింది. ఈ ట్వీట్ పై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. దీంతో నూతన పార్లమెంట్ భవనం సెంటర్‌గా కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల మంటలు రాజుకున్నాయి. జైరాం రమేష్ కు కౌంటర్ ఇస్తూ బేజేపీ నేతలు జేపీ నడ్డా, గిరిరాజ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ తీరుపై ఫైర్ అయ్యారు. ఇంతకీ జైరాం రమేష్ ఏమన్నారు..?

Congress Vs BJP: కొత్త పార్లమెంట్‌ భవనంపై రచ్చ రచ్చ.. కాంగ్రెస్ నేత జైరాం రమేష్‌కు నడ్డా, గిరిరాజ్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్..
Jp Nadda Jairam Ramesh

Updated on: Sep 23, 2023 | 12:51 PM

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అనంతరం ‘కొత్త పార్లమెంట్‌ భవనం’పై రచ్చ మొదలైంది.. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్‌ జాతీయ రాజకీయాల్లో దుమారం రేపింది. ఈ ట్వీట్ పై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. దీంతో నూతన పార్లమెంట్ భవనం సెంటర్‌గా కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల మంటలు రాజుకున్నాయి. జైరాం రమేష్ కు కౌంటర్ ఇస్తూ బేజేపీ నేతలు జేపీ నడ్డా, గిరిరాజ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ తీరుపై ఫైర్ అయ్యారు. ఇంతకీ జైరాం రమేష్ ఏమన్నారు..? జేపీ నడ్డా ఏమన్నారు..? అసలేం జరిగిందో ఓ సారి చూద్దాం..

కొత్త పార్లమెంటు భవనాన్ని “మోదీ మల్టీప్లెక్స్ లేదా మోడీ మారియట్” అని పిలవాలని.. ఇది “ప్రధాని లక్ష్యాలను బాగా గ్రహించింది” అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ శనివారం పేర్కొన్నారు. తాను పాత పార్లమెంటు భవనాన్ని కోల్పోయానని. కొత్తది “క్లాస్ట్రోఫోబిక్”, “చిట్టడవిలా” ఉందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. “చాలా హైప్‌తో ప్రారంభించిన కొత్త పార్లమెంటు భవనం వాస్తవానికి ప్రధానమంత్రి లక్ష్యాలను బాగా గ్రహించింది. దీనిని మోడీ మల్టీప్లెక్స్ లేదా మోడీ మారియట్ అని పిలవాలి. నాలుగు రోజుల తర్వాత.. నేను చూసినది ఉభయ సభలలో.. లాబీలలో గందరగోళాలు.. సంభాషణలు.. ” అని ఆయన X పోస్ట్‌లో పేర్కొన్నారు.

కొత్త, పాత పార్లమెంట్ భవనాల మధ్య ఉన్న వ్యత్యాసాలను ఎత్తిచూపిన కాంగ్రెస్ నేత జైరాం రమేష్, కొత్త భవనంలోని హాళ్లు హాయిగా లేవని, ఒకరినొకరు చూసేందుకు బైనాక్యులర్స్ అవసరమని అన్నారు. పాత పార్లమెంట్ భవనం ఒక నిర్దిష్ట ఆకారంలో ఉండటమే కాకుండా సంభాషణలను సులభతరం చేసిందని.. సెంట్రల్ హాల్, కారిడార్ల మధ్య నడవడం సులభం. ఈ కొత్త పార్లమెంటులో అలా లేదు.. గజిబిజిగా ఉంది. పాత భవనంలో వెళ్లి రావడం సులభం.. కొత్త భవనంలో అలా కాదు.. తప్పిపోతే.. చిట్టడవిలో ఉన్నట్లే.. కొత్తది దాదాపు క్లాస్ట్రోఫోబిక్‌గా ఉంది.. అంటూ పేర్కొన్నారు.

జైరాం రమేష్ ట్వీట్..

కొత్త పార్లమెంటు భవనం బాధాకరంగా ఉందని.. పేర్కొన్న కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్..  పార్లమెంటులో గడపడం వల్ల కలిగే ఆనందం అదృశ్యమైందన్నారు. అందుకే పాత బిల్డింగ్‌కి వెళ్లాలని ఎదురుచూస్తుంటానన్నారు. పార్టీలకు అతీతంగా తన సహచర ఎంపీలు చాలా మంది అలాగే భావిస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నట్లు తెలిపారు. సచివాలయంలోని సిబ్బంది నుంచి కొత్త భవనం రూపకల్పనలో వారి పనిని చేయడానికి అవసరమైన వివిధ కార్యాచరణలను పరిగణనలోకి తీసుకోలేదని విన్నానన్నారు. భవనాన్ని నిర్మించే వ్యక్తులతో సంప్రదింపులు జరపనప్పుడు ఇలా జరుగుతుందని అభిప్రాయపడిన కాంగ్రెస్ నేత.. బహుశా 2024లో పాలన మార్పు తర్వాత కొత్త పార్లమెంటు భవనానికి మంచి ఉపయోగం కనుగొనబడుతుందని ఆశిస్తున్నట్లు జైరాం రమేష్ తన ట్విట్‌ను ముగించారు.

జేపీ నడ్డా ట్వీట్..

కాగా.. జైరాం రమేష్ ట్వీట్ పై జేపీ నడ్డా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అత్యల్ప ప్రమాణాల ప్రకారం కూడా.. ఇది దయనీయమైన ఆలోచన. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అవమానించడమే తప్ప మరొకటి కాదు. ఏది ఏమైనప్పటికీ, కాంగ్రెస్ పార్లమెంటును వ్యతిరేకించడం ఇదే మొదటిసారి కాదు. వారు 1975లో ప్రయత్నించారు.. అది ఘోరంగా విఫలమైంది.. అంటూ జేపీ నడ్డా చురకలంటించారు. ఈ మేరకు జైరాం రమేష్ ట్వీట్ ను రీట్విట్ చేశారు.

గిరిరాజ్ సింగ్ ట్విట్..

జైరాం రమేష్ ట్వీట్ పై జేపీ నడ్డాతోపాటు.. గిరిరాజ్ సింగ్ సైతం స్పందించారు. భారతదేశం అంతటా ఉన్న #DynasticDens (రాజవంశం కాలం నాటి ప్రదేశాలు) అంచనా వేయాలని, హేతుబద్ధీకరించాలని నేను డిమాండ్ చేస్తున్నానన్నారు. స్టార్టర్స్ కోసం.. 1 సఫ్దర్‌జంగ్ రోడ్ కాంప్లెక్స్‌ను తక్షణమే తిరిగి భారత ప్రభుత్వానికి బదిలీ చేయాలి.. ప్రధానమంత్రులందరికీ ఇప్పుడు PM మ్యూజియంలో స్థలం ఉంది.. అంటూ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు.

కాగా.. మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో గణేష్ చతుర్థి సందర్భంగా సెప్టెంబర్ 19న నూతన పార్లమెంట్‌లోకి అధికారిక ప్రవేశం జరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..