
అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు పరప్పన అగ్రహార జైలులో లైబ్రరీ క్లర్క్‌గా పని కేటాయించారు. జైలు అధికారుల ప్రకారం.. అతని బాధ్యతలలో తోటి ఖైదీలకు పుస్తకాలు ఇవ్వడం, వాటి రికార్డులను నిర్వహించడం వంటివి ఉన్నాయి.
“నిర్దేశిత విధులను పూర్తి చేసినట్లయితే, అతను ప్రతి పని దినానికి రూ.522 పొందతాడు. జైలు నిబంధనల ప్రకారం జీవిత ఖైదు చేయబడిన ఖైదీలు ఏదో ఒక రకమైన శ్రమను చేయవలసి ఉంటుంది. వారి నైపుణ్యాలు, సంసిద్ధతను బట్టి నియామకాలు జరుగుతాయి అని జైలు అధికారి తెలిపారు. పరిపాలనా పనులను నిర్వహించడానికి రేవణ్ణ ఆసక్తి చూపారని, కానీ జైలు యంత్రాంగం అతన్ని లైబ్రరీలో ఉంచాలని నిర్ణయించిందని వర్గాలు తెలిపాయి.
ఈ పాత్రలో అతను ఇప్పటికే ఒక రోజు పనిని పూర్తి చేశాడు. ఖైదీలు సాధారణంగా నెలలో కనీసం 12 రోజులు, వారానికి మూడు రోజులు పని చేయాల్సి ఉంటుంది. అయితే రేవణ్ణ ప్రస్తుతం కోర్టు కార్యకలాపాలకు హాజరు కావడం, తన న్యాయవాదులను కలవడం వంటి వాటితో సమయం గడుపుతున్నందున ఆయన షెడ్యూల్ పరిమితంగా ఉంది. మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు, జెడి(ఎస్) సీనియర్ నాయకుడు, హోలెనరసిపుర ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణ కుమారుడు అయిన రేవణ్ణకు ఇటీవల అతనిపై దాఖలైన అత్యాచారం కేసులో ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి