AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిజ్బుల్‌ ముజాహిద్దీన్ ఉగ్రస్థావరం గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్..

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. నిత్యం లోయలో ఏదో ఓ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరగడం కానీ.. ఉగ్రవాదులను పట్టుకోవడమో జరుగుతోంది. బుద్గాం జిల్లాలో సోమవారం నాడు రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన 53 బెటాలియన్, సీఆర్పీఎఫ్‌కు..

హిజ్బుల్‌ ముజాహిద్దీన్ ఉగ్రస్థావరం గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 21, 2020 | 11:09 AM

Share

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. నిత్యం లోయలో ఏదో ఓ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరగడం కానీ.. ఉగ్రవాదులను పట్టుకోవడమో జరుగుతోంది. బుద్గాం జిల్లాలో సోమవారం నాడు రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన 53 బెటాలియన్, సీఆర్పీఎఫ్‌కు చెందిన 181 బెటాలియన్‌, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడడంతో.. జిల్లాలోని పాకేర్‌పొరా ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురు హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌కు చెందిన ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

కాగా, పట్టుబడ్డ ఉగ్రవాదులను మెహ్రాజ్‌దిన్ కుమారన్, తాహీర్ కుమార్, సాహిల్‌ హుర్రాగా గుర్తించారు. వీరిలో మెహ్రాజ్‌దిన్ కుమారన్, తాహీర్ కుమార్‌లు పాకేర్‌పొరా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తుపట్టారు. ఇక మరో ఉగ్రవాది సాహిల్ హుర్రా తిల్సరా ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. వీరి వద్ద నుంచి 20 రౌండ్ల ఏకే-47 గన్స్‌తో పాటు.. రెండు డిటోనేటర్స్‌,15 పోస్టర్స్‌తో సహా.. పలు ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Follow Us
ఇంట్లో ఈ ప్రదేశాల్లో దీపం వెలిగించకండి.. వాస్తు నియమాలు..
ఇంట్లో ఈ ప్రదేశాల్లో దీపం వెలిగించకండి.. వాస్తు నియమాలు..
చిటికెడు పొడితో.. బీపీ 190 ఉన్నా 110 కి దిగి రావాల్సిందే!
చిటికెడు పొడితో.. బీపీ 190 ఉన్నా 110 కి దిగి రావాల్సిందే!
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం..
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం..
చిట్టి పునుగులు తినాలనిపిస్తే.. అప్పటికప్పుడు ఇలా చేయండి!
చిట్టి పునుగులు తినాలనిపిస్తే.. అప్పటికప్పుడు ఇలా చేయండి!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దసరా, దీపావళి స్పెషల్ ట్రైన్స్ ఇవే
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దసరా, దీపావళి స్పెషల్ ట్రైన్స్ ఇవే
OTTలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTTలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మలబద్ధకానికి చెక్ పెట్టాలా? ఈ పండ్లను మీ డైట్‌లో చేర్చుకోండి!
మలబద్ధకానికి చెక్ పెట్టాలా? ఈ పండ్లను మీ డైట్‌లో చేర్చుకోండి!
అతడు సినిమాలో త్రిష అక్కగా నటించిన హారిక గుర్తున్నారా ?
అతడు సినిమాలో త్రిష అక్కగా నటించిన హారిక గుర్తున్నారా ?
బంగారం కాదు మార్కెట్లో వెండి మెరుపులు.. 150శాతం లాభాలతో సరికొత్త
బంగారం కాదు మార్కెట్లో వెండి మెరుపులు.. 150శాతం లాభాలతో సరికొత్త
చేతులు, ఓ కాలు లేకపోయినా .. 92% మార్కులతో స్కూల్‌ టాప్‌!
చేతులు, ఓ కాలు లేకపోయినా .. 92% మార్కులతో స్కూల్‌ టాప్‌!