లోయలో కాల్పుల మోత.. జవాన్ వీరమరణం..

దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనాపై పోరు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే అదనుగా చేసుకుని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలో అలజడి సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరి ప్రయత్నాలన్నింటిని భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంటుంది. తాజాగా ఆదివారం ఉదయం జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ జవాన్ వీరమరణం పొందగా.. మరో ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమచారంతో భద్రతా […]

లోయలో కాల్పుల మోత.. జవాన్ వీరమరణం..

Edited By:

Updated on: May 17, 2020 | 1:42 PM

దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనాపై పోరు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే అదనుగా చేసుకుని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలో అలజడి సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరి ప్రయత్నాలన్నింటిని భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంటుంది. తాజాగా ఆదివారం ఉదయం జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ జవాన్ వీరమరణం పొందగా.. మరో ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపడుతుండగా.. వీరిని గమనించిన ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు దిగారు. అయితే వెంటనే అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులకు దిగింది. ఈ క్రమంలోనే ఓ జవాన్ అమరుడవ్వగా.. హిజ్బుల్ ముజాహిద్దిన్‌కు చెందిన ఉగ్రవాదిని మట్టుబెట్టారు. అయితే మరో ఉగ్రవాది అక్కడి నుంచి పారిపోవడంతో.. సైన్యం అతడి కోసం గాలింపు చేపడుతోంది.