‘వంద’నం… జమ్మూ కాశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో శత సంవత్సరాల వృద్ధురాలి స్ఫూర్తి… ఏం చేసిందంటే…

| Edited By:

Dec 13, 2020 | 4:03 PM

ప్రజలే పాలకులను ఎన్నుకునే అవకాశం కల్పించిన గొప్ప వ్యవస్థ ప్రజాస్వామ్యం. అలాంటి ప్రజాస్వామ్యానికి ప్రాణం ఎన్నికలు. అయితే దేశ వ్యాప్తంగా మెట్రోపాలిటన్ నగరాల్లో ఓటింగ్ శాతం ఎప్పుడు సగాన్ని మించి పోవడం లేదు.

‘వంద’నం... జమ్మూ కాశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో శత సంవత్సరాల వృద్ధురాలి స్ఫూర్తి... ఏం చేసిందంటే...
Follow us on

ప్రజలే పాలకులను ఎన్నుకునే అవకాశం కల్పించిన గొప్ప వ్యవస్థ ప్రజాస్వామ్యం. అలాంటి ప్రజాస్వామ్యానికి ప్రాణం ఎన్నికలు. అయితే దేశ వ్యాప్తంగా మెట్రోపాలిటన్ నగరాల్లో ఓటింగ్ శాతం ఎప్పుడు సగాన్ని మించి పోవడం లేదు. యువకులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇలా అన్ని వర్గాల వారు ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వారి ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. ఈ క్రమంలో ఓ శత సంవత్సరాల వృద్ధురాలు చేసిన పని ప్రజాస్వామ్యానికి ప్రాణ ప్రతిష్ట చేసింది.

ఎక్కడ అంటే….

జమ్మూ కాశ్మీర్ లో డిస్ట్రిక్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరో దశ పోలింగ్ నడుస్తోంది. శత సంవత్సరాలున్న గనేరు దేవి అనే వృద్ధురాలు చలిలో వణికిపోతూ మరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ… నేను ఓటు వేసింది అభివృద్ధి కోసం ప్రజాప్రయోజనం కోసం అని తెలిపింది. కాగా, డీడీసీ ఎన్నికల్లో పోలింగ్ 42 శాతమే నమోదైంది.