ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్‌కు ఓ చిన్నారి ప్రత్యేక బహుమతిని అందించింది. చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు ఆయనతో పాటు శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. ఈ మేరకు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌కు ప్రత్యేక బహుమతి లభించింది. ఓ చిన్నారి అతనికి ఊహించని గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది. ఇస్రో శాస్త్రవేత్త పివి వెంకటకృష్ణన్ అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా నెటిజన్లతో పంచుకున్నారు. ఆ చిన్నారి అతనికి విక్రమ్ ల్యాండర్ చేతితో తయారు చేసిన మోడల్‌ను గిఫ్ట్ ఇచ్చాడు. దేశ ప్రజలందరి తరపున ఇస్రో చీఫ్‌కి ఈ గిప్ట్ అని చెప్పారు.
ISRO Chief Sri Somanath today had a surprise visitor,A young neighbour boy has handed over own made Vikram Lander model to the ISRO chief on behalf of all the neighbours. pic.twitter.com/BcyHYO0pDW
ఇవి కూడా చదవండి— Dr. P V Venkitakrishnan (@DrPVVenkitakri1) September 2, 2023
ఇస్రో శాస్త్రవేత్త పివి వెంకటకృష్ణన్ ఫోటోతో పాటుగా..క్యాప్షన్‌లో ఇలా రాశాడు, ‘ఇస్రో చీఫ్ సోమనాథ్ కోసం అనుకోని అతిథి వచ్చారు. ఆ సందర్శకుడు ఊహించని, ఆశ్చర్యకరమైన గిఫ్ట్ ఇచ్చారు. ఓ చిన్నారి తాను తయారు చేసిన విక్రమ్ ల్యాండర్ మోడల్‌ను అందరి తరపున ఇస్రో చీఫ్‌కి అందజేశాడని, ఇక ఈపోస్ట్ సోషల్ మీడియాలో పడగానే ఇంటర్నెట్‌లో ప్రజలు ఈ పోస్ట్‌ని విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఈ రోజు ఇస్రో యువతను సైన్స్ రంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఎంతగా ప్రోత్సహిస్తోందో, చైతన్యవంతం చేస్తుందో ప్రజలు చెబుతున్నారు. ఆగస్టు 23న చంద్రునిపై విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత ఇస్రో చీఫ్ సోమనాథ్, ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రపంచం నలుమూలల నుండి ప్రేమ, ప్రశంసలు లభిస్తున్నాయి.
ఈ ఫోటో సోషల్ మీడియాలో ఇప్పటికే మూడు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. 23 వేల మందికి పైగా లైక్ చేశారు. భారీ సంఖ్యలో ప్రజలు ఈ ఫోటోని రీట్వీట్ చేస్తున్నారు. దీనిపై కామెంట్ చేస్తూ తమ ఫీడ్ బ్యాక్ కూడా ఇస్తున్నారు. పిల్లవాడు ఒక మేధావి అంటూ ఒకరు వ్యాఖ్యానించగా, చిన్నతనంలో గాలిపటాలు, విమానాలు తయారు చేసి ఎగరేసేవాళ్లం కానీ, ఈ కుర్రాడు ఏకంగా మూన్ మిషన్‌ని తయారు చేశాడంటూ మరోకరు ప్రశంసించారు.
మరో వినియోగదారు స్పందిస్తూ..ఈ అబ్బాయి ఉత్సాహాన్ని మెచ్చుకోండి. భవిష్యత్తులో సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాడేమో అంటున్నారు. మరోకరు.. ఆ పిల్లాడి కళ్ళు చూడండి.. అతడి కళ్లలో ఒక కాంతి కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఇస్రో భవిష్యత్తు సురక్షితమైన చేతుల్లో ఉందని దీని అర్థం అన్నారు మరొకరు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..