Watch Video: వరదలకు కొట్టుకుపోయిన బ్రిడ్జి.. భక్తులను సైన్యం ఎలా కాపాడిందో చూడండి!

హిమాచల్‌ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు నీట మునగడమే కాకుండా, కొన్ని ప్రాంతాల్లో బ్రిడ్జ్‌లు కూడా తెగిపోయాయి. ఈ క్రమంలో అక్కడి ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు వారిని జిప్‌లైన్‌ సహాయంతో సురక్షితంగా కాపాడారు.

Watch Video: వరదలకు కొట్టుకుపోయిన బ్రిడ్జి.. భక్తులను సైన్యం ఎలా కాపాడిందో చూడండి!
Himachal Rescue Operations,

Updated on: Aug 06, 2025 | 2:51 PM

హిమాచల్‌ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు నీట మునగడమే కాకుండా, కొన్ని ప్రాంతాల్లో బ్రిడ్జ్‌లు కూడా తెగిపోయాయి. కిర్‌ జిన్నౌల్లానూ ఇదే పరిస్థితి నెలకొంది. భారీ వరద ఉధ్రృతికి ఓ బ్రిడ్జి కొట్టకుపోయింది. దీంతో కిన్నౌర్ కైలాష్ మార్గంలో ప్రయాణిస్తున్న సుమారు 413 మంది భక్తులు అక్కడే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ఐటీబీపీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగింది. వారిని కాపాడేందుకు పలు మార్గాలను అన్వేషించింది.

ఈ క్రమంలో జిప్ లైన్ ఏర్పాటు చేసి.. దాని ద్వారా ఒక్కొక్కరిని నది అవతల వైపునకు తీసుకువచ్చారు. అలా మొత్తం 413 మందిని రక్షించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే కొందరు ప్రయాణికులు ఇందుకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ విడియో కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.

మరోవైపు ఈ ఘటన స్థానిక అధికారులు స్పందిస్తూ.. ఈ సహాయక చర్యల్లో 14 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు పాల్గొన్నాయని తెలిపారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, దీంతో భారీగా వరదలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఈ వరదల వల్ల చాలా ప్రాంతాల్లో ట్రెక్కింగ్ మార్గాలు ధ్వంసమయ్యాయని దీంతో సహాయక చర్యల్లో తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. పర్యాటకులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిదని చెబుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.