ప్రధాని మోదీకి టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌ ఫోన్‌ కాల్.. ఈ ఏడాది చివరిలో భారత్‌లో పర్యటన!

టెస్లా వ్యవస్థాపకుడు, స్పేస్‌ ఎక్స్ సీఈవో, ప్రపంచ కుభేరుడు ఎలన్‌ మస్క్‌ భారత్‌ సందర్శనకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ అభిమానిని అనుచెప్పుకునే మస్క్‌ శనివారం (ఏప్రిల్ 19) ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ట్రంప్ పాలనా యాంత్రంగంలో ఎంతో కీలకమైన మస్క్.. ఉన్నట్లుండి ప్రధాని మోదీతో ఫాన్ లో సంభాషించడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది..

ప్రధాని మోదీకి టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌ ఫోన్‌ కాల్.. ఈ ఏడాది చివరిలో భారత్‌లో పర్యటన!
Elon Musk To Visit India Later This Year

Updated on: Apr 20, 2025 | 11:40 AM

టెస్లా వ్యవస్థాపకుడు, స్పేస్‌ ఎక్స్ సీఈవో, ప్రపంచ కుభేరుడు ఎలన్‌ మస్క్‌ భారత్‌ సందర్శనకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ అభిమానిని అనుచెప్పుకునే మస్క్‌ శనివారం (ఏప్రిల్ 19) ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ‘ప్రధాని మోదీతో మాట్లాడటం గౌరవంగా ఉంది. ఈ ఏడాది చివర్లో భారత్‌ సందర్శించడానికి తాను ఎంతో ఆసక్తికగా ఎదురు చూస్తున్నట్లు ఈ సందర్భంగా మస్క్‌ తన X ఖాతా పోస్ట్‌లో పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ పరిపాలనయా యంత్రాంగంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా మస్క్ పరిగణించబడుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం, సమాఖ్య శ్రామిక శక్తిని తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వ సామర్థ్య శాఖ (DOGE)కు మస్క్ ప్రాతినిద్యం వహిస్తున్నారు. భారత్‌-యుఎస్ సహకారాల గురించి చర్చలు జరిపిన ఒక రోజు తర్వాత ఎక్స్‌లో మస్క్ ఈ పోస్టు పెట్టారు.

కాగా వీరి సమావేశం అనంతరం ప్రధాని మోదీ సైతం ఎస్క్‌లో పోస్టు చేశారు. ఇందులో ‘ఎలన్‌ మస్క్‌తో మాట్లాడాను. ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్ DCలో జరిగిన సమావేశంలోని వివిధ అంశాలపై చర్చించాం. సాంకేతికత, ఆవిష్కరణ రంగాలలో సహకారం కోసం అపారమైన సామర్థ్యాలపై చర్చించామని మోదీ ఎక్స్‌ పోస్టులో వెల్లడించారు. ఈ రంగాలలో అమెరికాతో భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడానికి భారత్ కట్టుబడి ఉన్నట్లు మోదీ ఎక్స్ పోస్టులో వెల్లడించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రధాని మోదీ వాషింగ్టన్‌ను సందర్శించినప్పుడు వారి చర్చల్లో అంతరిక్షం, చలనశీలత, సాంకేతికత వంటి అంశాలు వచ్చాయి. ఇవి కూడా వీరి ఫోన్ కాల్ సంభాషణలో చోటు చేసుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.

నిజానికి, గత ఏడాదే మస్క్‌ భారత్‌ సందర్శనకు రావల్సి ఉంది. మస్క్‌ 2024లోనే భారత్‌ సందర్శిస్తానని చెప్పాడు. కానీ ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా వాయిదా పడింది. దీనితో మస్క్‌ భారత్ పర్యటన సాధ్యంకాలేదు. అయితే అమెరికా, చైనా మధ్య తీవ్ర వాణిజ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఎలోన్ మస్క్-ప్రధాని మోడీ ఫోన్ కాల్ ప్రస్తుతం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.