ఢిల్లీ , ముంబైలో బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపాయి. 70 మంది ఐటీ శాఖ సిబ్బంది ఢిల్లీ లోని బీబీసీ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. సిబ్బంది ఫోన్లను , కంప్యూటర్లను ఐటీ శాఖ సిబ్బంది సీజ్ చేశారు. సిబ్బందిని బయటకు వెళ్లొద్దని ఐటీ శాఖ అధికారులు కోరినట్టు తెలుస్తోంది. పన్ను ఎగవేత ఆరోపణలపై బీబీసీ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. అయితే బీబీసీ కార్యాలయాల్లో సోదాలు చేయడం లేదని , సర్వే మాత్రమే చేస్తునట్టు ఐటీ శాఖ వివరణ ఇచ్చింది. అకౌంటింగ్ శాఖ లోని కంప్యూటర్లలో డేటాను పరిశీలిస్తున్నారు ఐటీ శాఖ సిబ్బంది. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. దేశంలో అనధికార ఎమర్జెన్సీ అమలవుతోందని విమర్శించింది.
వినాశకాలే విపరీతబుద్ది అని అన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్. తొలుత మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించిన ప్రభుత్వం ఇప్పుడు ఐటీ సోదాలు చేస్తోందని మండిపడింది.
పన్ను ఎగవేతపై విచారణలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ మంగళవారం ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో సర్వే నిర్వహించింది. కంపెనీ వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలు, భారతీయ శాఖలకు సంబంధించిన పత్రాలను డిపార్ట్‌మెంట్ పరిశీలిస్తోంది. సర్వేలో భాగంగా, ఆదాయపు పన్ను శాఖ సంస్థ వ్యాపార ప్రాంగణాలను మాత్రమే కవర్ చేస్తుంది. దాని ప్రమోటర్లు లేదా డైరెక్టర్ల నివాసాలు.. ఇతర ప్రదేశాలలో దాడులు నిర్వహించదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
Income Tax department is conducting survey at the BBC office in Delhi: Sources pic.twitter.com/vqBNUUiHTD
— ANI (@ANI) February 14, 2023
మాజీ బీబీసీ ఉద్యోగి ఈటీవీ ఇండియాతో మాట్లాడుతూ తాను కార్యాలయంలో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని, అయితే ఫోన్‌లు స్విచ్ ఆఫ్ అయ్యాయని.. కార్యాలయానికి సీలు వేయబడిందని చెప్పారు. కానీ ఇది నిజంగా దాడినా లేదా శోధననా లేదా వారిని పిలిపించాలా అనేది వారికి ఇప్పటికీ తెలియదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం