ISRO సిగలో మరో మైలురాయి.. బాహుబలి రాకెట్‌ ప్రయోగం సక్సెస్‌ఫుల్‌.. CMS-03 ఎందుకంత స్పెషలంటే..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో మరో అరుదైన రికార్డ్ సృష్టించింది. బాహుబలి రాకెట్‌ సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది. షార్‌లోని రెండో లాంచ్ పాడ్ నుంచి, LVM 03-M5 రాకెట్‌ని ప్రయోగించారు. ఈ రాకెట్‌ ద్వారా, తొలిసారిగా అత్యంత భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు.

ISRO సిగలో మరో మైలురాయి.. బాహుబలి రాకెట్‌ ప్రయోగం సక్సెస్‌ఫుల్‌.. CMS-03 ఎందుకంత స్పెషలంటే..
Isro Lvm3 M5

Updated on: Nov 02, 2025 | 6:00 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో మరో అరుదైన రికార్డ్ సృష్టించింది. బాహుబలి రాకెట్‌ సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది. షార్‌లోని రెండో లాంచ్ పాడ్ నుంచి, LVM 03-M5 రాకెట్‌ని ప్రయోగించారు. ఈ రాకెట్‌ ద్వారా, తొలిసారిగా అత్యంత భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. సాయంత్రం 5.26 గంటలకు షార్‌లోని రెండో లాంచ్‌ పాడ్ నుంచి బాహుబలి రాకెట్ LVM3-M5 ద్వారా CMS-03 సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు. 4,410 కిలోల బరువున్న సీఎంఎస్‌-03 ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ GTOలోకి ప్రవేశపెట్టారు.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన సీఎంఎస్‌-03 ఉపగ్రహం.. కౌంట్ డౌన్ ప్రక్రియ 24గంటల సమయం పాటు నిర్విరామంగా కొనసాగింది.. ఆ తర్వాత సరిగ్గా ఇవాళ సాయంత్రం 5.26 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిరింది బాహుబలి రాకెట్‌. ఈ ప్రయోగం విజయవంతంతో ఇస్రో మరో మైలు రాయిని చేరుకుంది.. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపుతున్న CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహం పది సంవత్సరాల పాటు కక్ష్యలో పరిభ్రమిస్తూ సేవలు అందిస్తుంది.

CMS-03 ఎందుకంత స్పెషల్..?

ప్రయోగించిన రాకెట్టూ స్పెషలే.. అందులో ప్రయాణించి కక్ష్యలోకి ఎంట్రీ ఇచ్చిన శాటిలైట్ కూడా స్పెషలే. బాహుబలి1, బాహుబలి2 అని చెప్పుకోవచ్చు. ఇంతకీ CMS-03 ఎందుకంత స్పెషల్..?

>>4,400 కేజీలు బరువు కలిగిన CMS-03 భూమి నుంచి 36 వేల కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇంత బరువైన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించడం ఇదే మొదటిసారి. అందుకే దీన్ని బాహుబలి శాటిలైట్ అంటున్నారు.

>>CMS-03.. దీనికి GSAT-7R అని మరో పేరుంది. ఇది పూర్తిగా కమ్యూనికేషన్ రిలేటెడ్ శాటిలైట్. పది సంవత్సరాల పాటు కక్ష్యలో పరిభ్రమిస్తూ సేవలు అందిస్తుంది.

>>ఈ శాటిలైట్ ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడ్డంతో పాటు సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది.

>>గతంలో జీశాట్-7 అనే ఉపగ్రహాన్ని ఫ్రెంచ్ గయానా నుంచి ఇస్రో ప్రయోగించింది. దీని కాలపరిమితి ముగియడంతో సరికొత్త టెక్నాలజీతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో GSAT-7R శాటిలైట్‌ను రూపొందించి, నింగికి పంపారు.

>>భారత భూ భాగంలోని మారుమూల అటవీ ప్రాంతాలు, సముద్ర ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించడంలో ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ నారాయణన్‌

ఈ బాహుబలి రాకెట్‌ అండ్‌ బాహుబలి శాటిలైట్‌ ప్రయోగం నేపథ్యంలో, తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్‌ దర్శించుకున్నారు. శాటిలైట్ ప్రయోగం సక్సెస్ కావాలని శ్రీవారికి మొక్కులు చెల్లించారు.