ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరిరంగన్‌ కన్నుమూత

ప్రముఖ శాస్త్రవేత్త ,ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె. కస్తూరిరంగన్ శుక్రవారం మరణించారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇస్రో, అంతరిక్ష కమిషన్ చైర్మన్, అంతరిక్ష శాఖ కార్యదర్శిగా ఆయన భారత అంతరిక్ష కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడంలో విశేష కృషి చేశారు.

ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరిరంగన్‌ కన్నుమూత
K Kasturirangan

Updated on: Apr 25, 2025 | 2:07 PM

ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్ కే.కస్తూరిరంగన్ శుక్రవారం మరణించారు. బెంగళూరులో ఆయన కన్నుమూశారు. ఇస్రోలో కస్తూరిరంగన్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌ను అభివృద్ధి చేసే బాధ్యతను నిర్వర్తించారు. ఇది ధ్రువ కక్ష్యలలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి ఎంతో ఉపయోగపడింది. కస్తూరిరంగన్‌ ఇస్రోతో పాటు అంతరిక్ష కమిషన్ ఛైర్మన్‌గా, అంతరిక్ష శాఖలో భారత ప్రభుత్వ కార్యదర్శిగా 9 సంవత్సరాలకు పైగా భారత అంతరిక్ష కార్యక్రమాన్ని అద్భుతంగా నడిపించారు, ఆగస్టు 27, 2003న తన పదవీ విరమణ చేశారు. అయితే ఆయన మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..