AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇస్రో మరో సంచలనం.. బాహుబలి రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ షురూ!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్ష ప్రయోగాల పరంపరలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకు షార్ లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి శాస్త్రవేత్తలు Lvm 03…M5 రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైం

ఇస్రో మరో సంచలనం.. బాహుబలి రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ షురూ!
Isro Lvm3 M5
Ch Murali
| Edited By: Balaraju Goud|

Updated on: Nov 01, 2025 | 5:04 PM

Share

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక బాహుబలి రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఆదివారం (నవంబర్ 02) సాయంత్రం 5:26 నిమిషాలకు తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి ఎల్వీఎం-3 ఎం5 (LVM3 -M5)అనే బాహుబలి రాకెట్ ప్రయోగం ద్వారా సీఎంఎస్-03 (CMS-3)అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియ మొదలైంది

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్ష ప్రయోగాల పరంపరలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకు షార్ లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి శాస్త్రవేత్తలు Lvm 03…M5 రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. అందులో భాగంగానే రేపు సాయంత్రం తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలోని రెండవ లాంచ్ పాడ్ ఈ రాకెట్ ప్రయోగానికి వేదిక కాబోతుంది.

ఈ రాకెట్ ప్రయోగం ద్వారా 4400 కేజీలు బరువు కలిగిన cms 03 (GSAT..7R )అనే ఉపగ్రహాన్ని భూమి నుంచి 36000 వేల కిలోమీటర్ల ఎత్తున ఉన్న GTO ORBIT(GEO SYNCHRONOUS TRANSFER ORBIT) భూ బదిలీ కక్ష లోకి ఈ భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టనున్నారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) నుండి LVM-3 M-5 రాకెట్ ప్రయోగాన్ని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే శాస్త్రవేత్తలు రాకెట్ అనుసంధాన పనులను పూర్తి చేసుకుని ఈ వాహక నౌకను శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్ కు సురక్షితంగా తరలించి ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేసి కౌంట్ డౌన్ ప్రక్రియను కూడా ప్రారంభించారు.

ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ 24గంటల సమయం పాటు నిర్విరామంగా కొనసాగిన తర్వాత సరిగ్గా నవంబర్ 2 సాయంత్రం ఐదు గంటల ఇరువై ఆరు నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగురుతుంది. Lvm-03 M5 అయితే ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్ వద్ద రాకెట్ ప్రయోగ రిహార్సల్స్ కూడా పూర్తి చేశారు. అయితే వాతావరణం కనుక అనుకూలిస్తే శాస్త్రవేత్తలుఅనుకున్న ప్రకారం ఈ భారీ బహుబలి రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు.

ఏది ఏమైనా ఈ తరహా రాకెట్ ప్రయోగాలు ఇస్రో శాస్త్రవేత్తలు షార్ నుండి ఇప్పటి వరకు ఇంత బరువు కలిగిన ఉపగ్రహాన్ని పంపడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ ప్రయోగం విజయవంతం అయితే ఇస్రో మరో మైలు రాయిని చేరుకుంటుంది. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపుతున్న cms 03 కమ్యూనికేషన్ ఉపగ్రహం కక్షలో పది సంవత్సరాల పాటు పరిభ్రమిస్తూ సేవలు అందిస్తుంది.

ఇదిలావుంటే, ఇంటర్నెట్ సౌకర్యాల కోసం ఇస్రో జీసాట్ సెవెన్ (Gsat..7) అనబడే ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు 2013 వ సంవత్సరంలో ఫ్రెంచ్ గయానా నుండి కమర్షియల్ రాకెట్ ప్రయోగంగా ప్రయోగించింది. ఆ రోజు నుండి భారత దేశంకు gsaat-7 శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తూ ఉన్న ఈ ఉపగ్రహం కాలపరిమితి ముగియడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సరికొత్త టెక్నాలజీతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన జీసాట్ సెవెన్ ఆర్ GSAT..7R (cms 03 )అనే ఈ ఉపగ్రహాన్ని అధునాతన టెక్నాలజీలతో రూపకల్పన చేసిన ఈ ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగికి పంపేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. అయితే 4400 కేజీలు బరువు కలిగిన cms 03 ఉపగ్రహం ద్వారా భారత దేశంలోని భూ బాగంతో సహా మారుమూల ప్రాంతాలైన అటవీ ప్రాంతం, విస్తృత సముద్ర ప్రాంతంలో మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఈ GSAT..7R (cms 03)ఉపగ్రహం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

కమ్యూనికేషన్ రంగం కోసం 2013 లో ఇస్రో ఫ్రెంచ్ గయానా నుండి ప్రయోగించిన ఈ Gsat ..7 ఉపగ్రహం కాల పరిమితి ముగియడంతో తిరిగి కొత్త ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన జిసాట్ సెవెన్ ఆర్ అనే ఉపగ్రహాము ద్వారా భారతదేశానికి సరికొత్త విధానంలో ఇంటర్నెట్ సౌకర్యాలను మారుమూల ప్రాంతాల సైతం అందుకునే విధంగా ఈ జి సాట్ సెవెన్ ఆర్ అనే ఉపగ్రహానికి శాస్త్రవేత్తలు ప్రాణం పోశారు. ఈ Gaast-7R శాటిలైట్ భూమి మీద నుండి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష జీటిఓ ఆర్బిట్ లోకి ఈ శాటిలైట్ ను శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టనున్నారు.

ఈ GAST-7R ప్రయోగించిన రోజు నుండి మరో పది సంవత్సరాల కాలం పాటు భారతదేశానికి మెరుగైన ఇంటర్నెట్ సేవలను అందించే విధంగా ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. అయితే భారతదేశంలోని పలు మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పూర్తిగా సరిపడినంత ఇంటర్నెట్ సౌకర్యాలు లేక నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇస్రో సరికొత్త టెక్నాలజీతో ఈ జిసాట్ సెవెన్ ఆర్ ఉపగ్రహానికి రూపకల్పన చేసి ఈ ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో మరెన్నో మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించేందుకు శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేపడుతున్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..