ఢిల్లీలో ఎంబసీ వద్ద పేలుడు ఘటన, ప్రధాని మోదీతో మాట్లాడిన ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు,

| Edited By: Anil kumar poka

Feb 01, 2021 | 7:26 PM

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సోమవారం ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడారు. ఇటీవల ఢిల్లీలో తమ  దేశ ఎంబసీ వద్ద...

ఢిల్లీలో ఎంబసీ వద్ద పేలుడు ఘటన, ప్రధాని మోదీతో మాట్లాడిన ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు,
Follow us on

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సోమవారం ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడారు. ఇటీవల ఢిల్లీలో తమ  దేశ ఎంబసీ వద్ద జరిగిన పేలుడు ఘటన గురించి ప్రస్తావించిన ఆయన.. మా దేశ ప్రతినిధుల రక్షణకు మీ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ధన్యవాదాలని అన్నారు. భారత, ఇజ్రాయెల్ దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఇలాగే కొనసాగుతాయని ఆశిస్తున్నానని తెలిపారు. ఢిల్లీలోనిఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో జరిగిన పేలుడుపై జాతీయ దర్యాప్తు సంస్థతో సహా ఢిల్లీ పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ పేలుడుకి అమ్మోనియం నైట్రేట్ వాడినట్టు తేల్చారు. అదే ఆర్ డీ ఎక్స్ వాడి ఉంటె పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని భావిస్తున్నారు. కాగా ఈ ఘటనకు తామే కారణమని జైషే ఉల్ హింద్ సంస్థ ప్రకటించుకుంది. దీనిపై పోలీసులు ఇంకా ఆరా తీస్తున్నారు.