Israel-Palestine War: ‘మా ప్రజలకు భారత్‌ రెండవ ఇల్లు.. అప్పటివరకు ఇజ్రాయెల్‌ను ఎవ్వరూ ఆపలేరు’.. న్యూస్9 సంచలన ఇంటర్వ్యూ..

|

Oct 11, 2023 | 11:39 PM

Israel-Palestine conflict: ఇజ్రాయెల్‌ - హమాస్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. తమ భూభాగంలోకి చొరబడిన హమాస్‌ బలగాలను ఇజ్రాయెల్‌ సైన్యం మట్టుపెట్టే పనిలో పడింది. మరోవైపు హమాస్‌తో పాటు.. హిజ్బుల్లా, సిరియా కూడా దాడులకు తెగబడుతున్నాయి. బాంబులు మోతతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. రెండు వైపులా మరణించిన వారి సంఖ్య 3వేలు దాటింది. హమాస్‌ దాడుల్లో చనిపోయిన ఇజ్రాయెల్‌ పౌరుల సంఖ్య 1200 దాటింది. మరోవైవు గాజాపై ఇజ్రాయెల్‌ బలగాల భీకరదాడులు కొనసాగుతున్నాయి.

Israel-Palestine War: ‘మా ప్రజలకు భారత్‌ రెండవ ఇల్లు.. అప్పటివరకు ఇజ్రాయెల్‌ను ఎవ్వరూ ఆపలేరు’.. న్యూస్9 సంచలన ఇంటర్వ్యూ..
News9 Plus exclusive interview with Israel ambassador Naor Gilon
Follow us on

Israel-Palestine conflict: ఇజ్రాయెల్‌ – హమాస్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. తమ భూభాగంలోకి చొరబడిన హమాస్‌ బలగాలను ఇజ్రాయెల్‌ సైన్యం మట్టుపెట్టే పనిలో పడింది. మరోవైపు హమాస్‌తో పాటు.. హిజ్బుల్లా, సిరియా కూడా దాడులకు తెగబడుతున్నాయి. బాంబులు మోతతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. రెండు వైపులా మరణించిన వారి సంఖ్య 3వేలు దాటింది. హమాస్‌ దాడుల్లో చనిపోయిన ఇజ్రాయెల్‌ పౌరుల సంఖ్య 1200 దాటింది. మరోవైవు గాజాపై ఇజ్రాయెల్‌ బలగాల భీకరదాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌ దాడుల్లో 960 మంది పాలస్తీనా పౌరులు చనిపోగా 4000 మందికి పైగా గాయపడ్డారు. అయితే, హమాస్‌ చెరలో ఉన్న ఇజ్రాయెల్‌ పౌరులు జాడ ఇంకా చిక్కడం లేదు. ఇజ్రాయెల్‌ ఉత్తర సరిహద్దు లోని లెబనాన్‌ , సిరియా నుంచి కూడా దాడులు కొనసాగే అవకాశం ఉంది. దీంతో యుద్దం మరింత తీవ్రమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. యుద్దం తీవ్రమవ్వడంతో ఇరుదేశాలు సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ తరుణంలో భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి నార్ గిలోన్ హమాస్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వేలాది మంది అమాయక ప్రజలను పొట్టబెట్టుకున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. న్యూస్ 9 ప్లస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆదిత్య రాజ్ కౌల్‌ జరిపిన ప్రత్యేక ఇంటర్య్వూలో భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్.. హమాస్ దాడికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ ఉగ్రదాడి తర్వాత ఇజ్రాయెల్ తదుపరి కార్యాచరణ, దాడి వెనుక ఇరాన్ హస్తం.. తమ ప్రణాళిక తదితర వివరాలను వెల్లడించారు.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, హమాస్ అరాచకాల గురించి రాయబారి నార్ గిలోన్ పలు కీలక వివరాలను పంచుకున్నారు. దక్షిణ ఇజ్రాయెల్‌లో హమాస్ దళాలు అనేక మార్లు దాడులకు పాల్పడిందన్నారు. హమాస్ ఇజ్రాయెల్ లో 30కిపైగా కమ్యూనిటీ సెంటర్లలో చొరబాటు చేసిందని.. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ పతనం అయిందంటూ పేర్కొన్నారు. IDF (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) ఉగ్రవాదులను ఎదుర్కొంటోందని.. గాజాపై IDF వైమానిక దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు.

ప్రేరేపిత దాడులు..

హమాస్ దాడుల గురించి గిలోన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్ వి ప్రేరిపిత దాడులంటూ పేర్కొన్నారు. హమాస్ దాడుల వెనుక హిజ్బుల్లా, ఇరాన్ ప్రమేయం ఉండవచ్చంటూ పేర్కొన్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణ వారి వల్లే నంటూ తెలిపారు. పీస్ పార్టీ మారణకాండలో దాదాపు 260 మంది మరణించారన్నారు. ముందుగా ఇజ్రాయెల్ వైపు 5000+ రాకెట్లు ప్రయోగించారని.. ఇప్పటివరకు దాదాపు 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారని తెలిపారు.

అంతేకాకుండా హమాస్ ఉగ్రవాదులు దారుణాలకు పాల్పడుతున్నారంటూ గిలోన్ పేర్కొన్నారు. హమాస్ ఉగ్రవాదులు మహిళలపై అత్యాచారం, యువతుల అపహరణ, హత్యలకు తెగబడుతున్నారంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా హమాస్ దక్షిణాసియా, అమెరికన్, యూరోపియన్ పౌరులను కిడ్నాప్‌ చేస్తుందని గిలోన్ ఆవేదన వ్యక్తంచేశారు. చిన్నారులను చంపుతున్నారని.. హింసిస్తున్నారని తెలిపారు.

హమాస్ నిర్మూలన కోసం..

ఈ క్రమంలో ఇజ్రాయెల్ బలగాల గూఢచార వైఫల్యం గురించి కూడా ప్రస్తావించారు. గుఢాచార వ్యవస్థ వైఫల్యం చెందిందని తెలిపారు. అనంతరం హమాస్‌పై దాడికి ఇజ్రాయెల్ దళాలను తిరిగి సమూహపరిచామని.. IDF ద్వారా హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడంపైన దృష్టిపెట్టామని వివరించారు.

గిలోన్ మాట్లాడుతూ.. ప్రధానంగా గాజా హమాస్ ఆక్రమణలో ఉందని.. ఇజ్రాయెల్ తీవ్రవాద దాడి, కొత్త ఉగ్రవాద దాడి.. 9/11గా అభివర్ణించారు. ఇజ్రాయెల్ ఆక్రమణకు గురైన భూమి కోసం సిద్ధమవుతోందన్నారు. ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్‌లో మితవాద బలగాలకు సేవలు అందిస్తోందని.. మధ్యప్రాచ్యంలో అస్థిరత వెనుక ఇరాన్ ఉందని పేర్కొ్నారు. అబ్రహం ఒప్పందం ప్రమాదంలో ఉందంటూ.. రాయబారి నూర్ గిలోన్ యోమ్ కిప్పూర్ యుద్ధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇజ్రాయెల్‌ ప్రజలకు భారతదేశం రెండవ ఇల్లు..

ఈ సందర్భంగా ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు ప్రకటించడాన్ని గిలోన్ అభినందించారు. సౌదీ లాంటి ద్వంద్వ వైఖరిపై ఆయన విమర్శలు గుప్పించారు.ఇజ్రాయెల్ 2వ యుద్ధానికి సిద్ధంగా ఉందన్నారు. అంతేకాకుండా భారతదేశం మద్దతు గురించి ఆయన మాట్లాడారు. భారతదేశం మద్దతును అభినందిస్తున్నామని.. ప్రధాని మోడీ తమ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు‌తో మాట్లాడరని గుర్తుచేశారు. యుద్ధ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారని తెలిపారు.

అంతేకాకుండా.. భారత్-ఇజ్రాయెల్ స్నేహం గురించి గిలోన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ ప్రజలకు భారతదేశం రెండవ ఇల్లు లాంటిదని పేర్కొన్నారు. భారతదేశంలో ఎప్పుడూ యూదులపై విచారణ జరగలేదని.. దాడులు కూడా జరగలేదని తెలిపారు.

ఇజ్రాయెల్ యుద్ధం ముగింపునకు సిద్ధమైందని.. ఇజ్రాయెల్ హమాస్ దాడి సామర్థ్యాలను అనుసరిస్తూ ముందుకువెళ్తోందని తెలిపారు. ఇలాంటి తరుణంలో అందరూ శాంతియుతంగా ఆలోచించాలని పేర్కొంటున్నారని.. అయితే, హమాస్ మళ్లీ ఇజ్రాయెల్‌పై దాడి చేయదని నిర్ధారించుకునేంత వరకు ఇజ్రాయెల్‌ను ఎవరూ ఆపలేరని.. హమాస్‌కు ధీటైన జవాబు చెబుతామని.. ఎన్వాయ్ నౌర్ గిలోన్.. న్యూస్ 9 ప్లస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆదిత్య రాజ్ కౌల్‌ జరిపిన సంభాషణలో పేర్కొన్నారు.

ఇంటర్వ్యూ వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..