నిన్నటి వరకూ ఢిల్లీకే పరిమితమైన భారత రెజ్లర్ల అంశంపై.. ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ… యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ మల్లయోధులకు అండగా నిలిచింది. బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు చేస్తూ కొన్ని రోజులుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. చివరకు వాళ్లు కష్టపడి సాధించిన పథకాలను కూడా గంగా నదిలో వేసేందుకు నిర్ణయించుకున్నారు. ఆమరణ నిరాహార దీక్షకూ సిద్ధమయ్యారు. పథకాలు గంగలో కలిపేందుకు హరిద్వార్ కూడా వెళ్లారు. అయితే రైతు సంఘం నేతల విజ్ఞప్తి మేరకు తమ కార్యక్రమాన్ని ఐదు రోజుల పాటు వాయిదా వేశారు రెజ్లర్లు. ఈ పరిణామాలన్నీ గమనించిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను హెచ్చరించింది.
పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ ఆందోళన చేపట్టిన రెజ్లర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించింది. బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలను తేల్చేందుకు చేపట్టిన దర్యాప్తు కమిటీ రిపోర్టుపైనా ఆసంతృప్తి వ్యక్తం చేసింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరింది. 45 రోజుల్లోగా రెజ్లింగ్ సమాఖ్యకు ఎన్నికలు నిర్వహించకుంటే.. ఆ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేస్తామని హెచ్చరిక చేసింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీరుతో ఇప్పటికే ఈ ఏడాది ఢిల్లీలో జరగాల్సిన ఆసియా చాంపియన్‌షిప్‌ను మరో చోటుకు తరలించే నిర్ణయం తీసుకున్నట్లు UWW ప్రకటించింది. ఇప్పటికైనా స్పందించకపోతే మున్ముందు భారీ మూల్యం తప్పదనేది UWW స్టేట్మెంట్ సారాంశం.
ఢిల్లీ పోలీసులు మాత్రం బ్రిజ్ భూషణ్‌పై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవంటున్నారు. మరోవైపు నిరసన చేస్తున్న రెజ్లర్ల పట్ల బ్రిజ్ భూషణ్ వ్యంగ్యంగా మాట్లాడటాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఇప్పుడు వరల్డ్ రెజ్లింగ్ బాడీ ఎంట్రీతో ఈ వివాదానికి పరిష్కారం. దొరుకుతుందో లేదో చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.