
స్కూల్‌పిల్లలు, కాలేజీ అమ్మాయిలు, మహిళలను పూడ్చిపెట్టానంటున్న వ్యక్తే.. కనీసం 300 శవాల లెక్క చెబుతున్నాడు. ఇవికాక, ధర్మస్థలలో మరో 452 మంది అనుమానాస్పద రీతిలో చనిపోయారని RTI డేటా చెబుతోంది. అంటే.. ఇప్పటికి తేలుతున్న మరణాల సంఖ్యనే 752. మరి లెక్కలోకి రాని హత్యల మాటేంటి? అసలు ధర్మస్థలలో వ్యవస్థలు, ప్రభుత్వ యంత్రాంగం ఉందా అనేదే అతిపెద్ద సందేహం. కొందరు పెద్దమనుషులు ధర్మస్థల ప్రాంతం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని ఏలుతున్నారు. వాళ్లు చేసినవే ఈ అత్యాచారాలు, హత్యలు. వాళ్ల ఆధిపత్యం ఎంతటిదంటే.. ఓ మంత్రి పరామర్శకని బయల్దేరి, ధర్మస్థల పొలిమేర వరకూ వచ్చి వెనక్కి వెళ్లిపోయాడు. ఎవరు ఆపి ఉంటారు ఆ మంత్రిని? అక్కడ జరుగుతున్న దుర్మార్గాలపై సాక్ష్యం చెబుతానంటూ ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. కాని, పోలీసులను కదలనివ్వకుండా చేశారు. అలా కదలనివ్వకుండా చేసింది ఎవరై ఉంటారు? దయచేసి బలహీనమైన వ్యక్తులు వినకూడదీ మాటలు. అండర్‌వేర్ లేని ఎంతోమంది మహిళలను, బడికి వెళ్లే 12 ఏళ్ల ఆడపిల్లను, కాలేజ్ అమ్మాయిల నగ్న శవాలను పూడ్చిపెట్టాడొక పారిశుద్ధ్య కార్మికుడు. స్కూల్‌కి వెళ్లే ఓ అమ్మాయి.. వయసు దాదాపు 12 నుంచి 15 ఏళ్లుంటుంది. ఆమెకు స్కూల్ యూనిఫాం చొక్కా మాత్రమే ఉంది. అండర్‌వేర్, స్కర్ట్ లేవు. ఆమెపై ఊరకుక్కల్లా పడి చెరిచిన గుర్తులు ఉండడం స్పష్టంగా చూశాడు. మెడపై దారుణమైన గాయాలున్నాయి. ఆ పాప శవాన్ని స్కూల్ బ్యాగ్‌తో సహా పూడ్చేశాడు. ఓ యువతి. బహుశా 20...