INS Taragiri: తారాగిరి.. సంద్రంలో దాదాగిరి.. ఇండియన్ నేవీలో ఆల్‌రౌండర్.. స్పెషాలిటీ తెలిస్తే వణుకే..

భారతదేశం యుద్ద నౌకల నిర్మాణం, రూపకల్పనలో స్వయం సమృద్ధి శక్తిగా అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఇందులో భాగంగానే నీలగిరి శ్రేణి స్టెల్త్ ఫ్రిగ్రేట్ నౌకలను భారత నావికాదళం రంగంలోకి దించుతుంది. భారత సంపూర్ణ స్వదేశీ నౌకదల శక్తిగా ఎదగాలన్న ప్రయాణంలో.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యుద్ధ నౌకలను నావికాదళంలోకి చేరుస్తుంది. ఇందులో భాగంగానే 'తారాగిరి' నావికాదళంలో సేవలు అందించేందుకు సిద్ధమైంది.

INS Taragiri: తారాగిరి.. సంద్రంలో దాదాగిరి.. ఇండియన్ నేవీలో ఆల్‌రౌండర్.. స్పెషాలిటీ తెలిస్తే వణుకే..
INS Taragiri Joins Indian Navy

Edited By:

Updated on: Apr 02, 2026 | 11:29 AM

ఇండియన్ నేవీలో మరో అత్యాధునిక అస్త్రం చేరబోతోంది. నావికాదళ అమ్ములపొదిలో స్టెల్త్ ఫ్రిగ్రేట్ యుద్ధనౌక చేరి సేవల కోసం ‘తారాగిరి’ సిద్ధమైంది. విశాఖలో తారాగిరి యుద్ధ నౌక కమిషనింగ్ కార్యక్రమం వేడుకగా నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరవుతారు. తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రం నుంచి సేవలందించినుంది తారాగిరి. అధునాతన టెక్నాలజీతో నీలగిరి శ్రేణి స్టెల్త్ ఫ్రిగ్రేట్ యుద్ధనౌక తారాగిరి ని డిజైన్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే నేవీలో ‘మిస్సైల్ పవర్ హౌస్’ గా ఈ యుద్ధ నౌక సేవలందించనుంది.

భారతదేశం యుద్ద నౌకల నిర్మాణం, రూపకల్పనలో స్వయం సమృద్ధి శక్తిగా అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఇందులో భాగంగానే నీలగిరి శ్రేణి స్టెల్త్ ఫ్రిగ్రేట్ నౌకలను భారత నావికాదళం రంగంలోకి దించుతుంది. భారత సంపూర్ణ స్వదేశీ నౌకదల శక్తిగా ఎదగాలన్న ప్రయాణంలో.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యుద్ధ నౌకలను నావికాదళంలోకి చేరుస్తుంది. ఇందులో భాగంగానే ‘తారాగిరి’ నావికాదళంలో సేవలు అందించేందుకు సిద్ధమైంది.

అత్యాధునిక ఆయుధాలు, రాడార్ల వ్యవస్థ, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన తారాగిరి.. ఏప్రిల్ 3 శుక్రవారం నాడు అధికారికంగా నావికాదళంలోకి ప్రవేశిస్తుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా నేవీ అమ్ములపొదిలోకి తారాగిరి చేరుతుంది.

ఐఎన్ఎస్ తారాగిరి నౌక.. నీలగిరి క్లాస్ స్టెల్త్ గైడెడ్ ఫ్రీగ్రేట్ లలో నాలుగవది. ప్రాజెక్ట్ 17 ఆల్ఫా ఫి గ్రేట్ గా వర్గీకరించారు. స్టెల్త్ ఫ్రిగేట్ అంటే రాడార్, ఇన్‌ఫ్రారెడ్, ఇతర శత్రు గుర్తించే వ్యవస్థలకు సులభంగా చిక్కని విధంగా, ప్రత్యేక డిజైన్, సాంకేతికతతో రూపొందించబడిన యుద్ధనౌక. సముద్రంపై శత్రు నౌకలపై దాడి, గగన తలంలో క్షిపనులు, యుద్ధ విమానాలను ఎదుర్కోవడం, నీటి అడుగున జలాంతర్గాములను గుర్తించి ప్రతి దాడి చేయడం. అంటే ఒకే నౌకలో మల్టీ రోల్ కాంబాట్ కేపబిలిటీ ఉంటుంది. శత్రువులకు సులభంగా కదలికలు గుర్తించలేని విధంగా.. అంటే రాడార్, ఇన్ఫ్రా రెడ్, శబ్దం ద్వారా గుర్తించే టెక్నాలజీలకు చిక్కకుండా డిజైన్ చేశారు. ఫ్రిగ్రేట్ అంటే మధ్యస్థ పరిమాణంలో ఉండే యుద్ధనౌక..

తారాగిరిని ముంబైలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించి 2020 సెప్టెంబర్ 10న ఈ నౌక నిర్మాణాన్ని పూర్తి చేశారు. 2022 సెప్టెంబర్ 11న జలప్రవేశం చేయించారు. ముంబైలోని మజగావ్ డాక్ నిర్మించిన మూడవ ప్రాజెక్ట్ 17 ఏ క్లాస్ నౌక అయిన ఈ తారాగిరి.. నావికాదళంలో ఈనెల మూడో తేదీ నుంచి తన సేవలను ప్రారంభించనుంది.

నీలగిరి క్లాస్ గైడెడ్ మిస్సైల్ గ్రేడ్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ తారాగిరి. 6670 టన్నుల బరువును మోసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. 149 మీటర్ల పొడవు, 17.8 మీటర్ల వెడల్పు నేను ఒక ఉంటుంది. గంటకు 28 నాటికలు బైండ్లు అంటే 52 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ నౌకలో విమాన విధ్వంసక క్షిపణులు, నౌక విధ్వంసక క్షిపణులు, భూమిపై దాడి చేసే క్రూయిజ్ క్షిపణులు, నావికా ఫిరంగి, తుపాకులు కూడా ఉంటాయి. శత్రువు దాడులను దీటుగా ఎదుర్కోవడం, ప్రతి దాడి చేసేందుకు అవసరమైన.. ఆస్త్రాలతో ఈ నౌకను రూపొందించారు. ఒక విధంగా చెప్పాలంటే.. నావికాదళంలో మిస్సైల్ పవర్ హౌస్గా అభివర్ణించవచ్చు.

భారత నౌకాదళం తన సరికొత్త స్టెల్త్ ఫ్రిగేట్, తారాగిరి (F41)ని 03 ఏప్రిల్ 2026న అధికారికంగా ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరగనున్న ఈ వేడుక.. దేశం సంపూర్ణ స్వయం సమృద్ధి గల నౌకా శక్తిగా మారే దిశగా సాగిస్తున్న ప్రయాణానికి ఒక శక్తివంతమైన నిదర్శనంగా నిలుస్తుంది.

ప్రాజెక్ట్ 17A తరగతికి చెందిన నాల్గవ శక్తివంతమైన నౌకగా.. తారాగిరి కేవలం ఒక యుద్ధ నౌక మాత్రమే కాదు.. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తికి, మన స్వదేశీ నౌకా నిర్మాణ కేంద్రాల అధునాతన ఇంజనీరింగ్ సామర్థ్యాలకు 6670 టన్నుల ప్రతిరూపమని నావికాదళం ప్రకటనలో పేర్కొంది.

ముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) నిర్మించిన ఈ ఫ్రిగేట్.. గతంలో డిజైన్‌ల కంటే అడ్వాన్స్డ్గా రూపుదిద్దుకుంది. తారాగిరి స్వరూపం, అత్యాధునిక టెక్నాలజీ.. గణనీయంగా తగ్గిన రాడార్ క్రాస్-సెక్షన్‌ తో అత్యంత రహస్యంగా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. 75 శాతానికి పైగా స్వదేశీ సామగ్రితో.. ఈ నౌక దేశీయ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ పరిపక్వతను చాటిచెబుతుంది. ఈ వ్యవస్థలో ఇప్పుడు 200కు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEలు) ఉన్నాయి. ఇవి భారత ప్రభుత్వ ఆత్మనిర్భరత కార్యక్రమాలకు దోహదపడుతూ.. వేలాది భారతీయ ఉద్యోగాలకు మద్దతు ఇస్తున్నాయి.

కంబైన్డ్ డీజిల్, గ్యాస్ (CODOG) ప్రొపల్షన్ ప్లాంట్‌తో నడిచే తారాగిరి, ‘అధిక వేగం – అధిక ఓర్పు’ గల బహుముఖ, బహుళ సముద్ర కార్యకలాపాల కోసం రూపొందించబడింది. ఈ నౌక ఆయుధ సంపత్తి ప్రపంచ స్థాయిలో ఉంది. ఇందులో ‘సూపర్‌సోనిక్ సర్ఫేస్-టు-సర్ఫేస్ క్షిపణులు, మధ్య శ్రేణి సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణులు, ప్రత్యేకమైన జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ సామగ్రి’ ఉన్నాయి. ఈ వ్యవస్థలు అత్యాధునిక కాంబాట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా అనుసంధానించబడ్డాయి. దీనివల్ల అతి తక్కువ సమయంలో కచ్చితత్వంతో స్పందించగల సామర్థ్యం తారాగిరి సొంతం.

సముద్రాలలో కేవలం యుద్ధ రక్షణ అవసరాల కోసం మాత్రమే కాకుండా..ఆధునిక దౌత్యం, మానవతా సంక్షోభాల సంక్లిష్టతల కోసం తారాగిరి నిర్మించబడింది. దీని బహుముఖ మిషన్ ప్రొఫైల్.. మానవతా సహాయం, విపత్తు ఉపశమనం (HADR) వరకు ప్రతిదానికీ దీనిని ఆదర్శంగా చేస్తుంది.

భారతీయులు రూపొందించి, నిర్మించి, నడిపే నౌకలతో రక్షించబడే వికసిత్, సమృద్ధ భారత్ కోసం సముద్రాలను కాపాడుతూ.. భారత నౌకాదళం ఒక పోరాటానికి సిద్ధంగా ఉన్న, సమైక్య, విశ్వసనీయ, ఆత్మనిర్భర్ శక్తిగా ఎదుగుతూనే ఉంది. అభివృద్ధి చెందుతున్న సముద్ర శక్తికి ఒక మార్గదర్శిగా, నీలి సరిహద్దులకు సంరక్షకుడిగా, ఉజ్వల భవిష్యత్తుకు తారాగిరి సిద్ధంగా ఉందని నావికాదళం ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us