ముంబైలోని బాంద్రా శివార్లలో గల ఓ పార్కులో హఠాత్తుగా ఓ మోనోలిథ్ ప్రతక్షమైంది. జోగర్స్ పార్కుగా వ్యవహరించే ఈ ప్రాంతంలో ఈ మిస్టీరియస్ ఫలకం కనబడి అంతా ఆశ్చర్యపోయారు. దీని గురించి స్థానిక కార్పొరేటర్ అసిఫ్ జకారియా ట్వీట్ చేస్తూ.. ఇది సుమారు 7 అడుగుల పొడవు ఉందని, దీని ఒక వైపున కొన్ని నెంబర్లు ఉన్నాయని తెలిపారు. అవి అర్థం కావడంలేదన్నారు. ట్రయాంగులర్ ప్రిజమ్ షేపులో ఉన్న ఈ ఫలకాన్ని చూసేందుకు ఈ గార్డెన్ కి పలువురు విజిటర్లు వస్తున్నారు. ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి ఈ మోనోలిథ్ పానెల్ లోని ఒకదానిపై కోడ్ నెంబర్లతో బాటు కొంత ఆ సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఫలకం జాడపై ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించలేదు. మొదట దీనిపై ఆరా తీయాల్సిఉంటుందన్నారు. ఈ గార్డెన్ చాల వరకు నిర్మానుష్యంగా ఉంటుందని, నిన్నటివరకు ఇక్కడ ఎలాంటి స్ట్రక్చర్ లేదని వీరిలో ఒకరు తెలిపారు.
ఇండియాలో మొదట గత డిసెంబరులో గుజరాత్..అహమ్మదాబాద్ లో ఈ విధమైన మోనోలిథ్ కనబడింది. దాని కింద ఎలాంటి తవ్విన గుర్తులు కనబడలేదు. ఆ పార్క్ సంరక్షకుడు కూడా ఇది చాలా ఆశ్చర్యంగా ఉందని, తాను ఉదయం లేచి వచ్చి చూసేసరికి ఇది కనబడిందని చెప్పాడు. ఆ నగరంలో..అందరూ రోజూ వచ్చే పార్కులోనే ఈ ఫలకం కనబడింది. ఈ మిస్టీరియస్ మోనోలిత్ ల వ్యవహారమేమిటో అధికారులకు కూడా అంతు బట్టడంలేదు. వీటిని పార్కుల్లో ఏర్పాటు చేయడానికి ఎవరు ‘ఉద్యమిస్తున్నారో’ ఇందువల్ల వారికి కలిగే ప్రయోజనమేమిటో వారికి అర్థం కావడంలేదు. కేవలం నేచర్, పర్యావరణ పరిరక్షణకు ఈ పొడవాటి ఫలకాలను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారన్నది ఇప్పటివరకు అంతుబట్టలేదు.
మరిన్ని చదవండి ఇక్కడ :