India’s COVID-19 Vaccination: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 46వేల 148 కేసులు నమోదయ్యాయి. DRDOతో కలిసి అభివృద్ధి చేసిన 2డీజీని ఇవాళ మార్కెట్‌లోకి విడుదల చేసింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్. గతంలో ప్రకటించినట్టుగానే ప్యాకెట్ ధరను రూ.990గా తెలిపింది. ప్రభుత్వ సంస్థలకు సబ్సిడీ రేట్లకే ఇస్తామంది. వ్యాక్సినేషన్‌లో భారత్.. అమెరికాను మించిపోయింది. ఇప్పటి వరకు 32కోట్లకుపైగా డోసుల వ్యాక్సిన్లను ఇచ్చింది. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం.. టీవీ9 నినాదం.. దేశం విధానం. మరి ఇప్పటి వరకు దేశంలో ఎంత మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది? వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎంత మంది? దేశంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ఫుల్ డీటేల్స్ ఇప్పుడు చూద్దాం.
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 32 కోట్ల 17 లక్షల 60 వేల 077 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అందులో 26 కోట్ల 53 లక్షల 84 వేల 559 మందికి మొదటి డోస్ టీకా అందగా.. 5 కోట్ల 63 లక్షల 75 వేల 518 మందికి రెండో డోస్ కూడా పూర్తైంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఇప్పటి వరకు 64 లక్షల 25 వేల మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. ఇక, ఏయే వయసు వారు ఎంతమంది టీకా తీసుకున్నారోచూద్దాం..
HCWs | 1st Dose | 1,01,96,091 |
2nd Dose | 72,00,994 | |
FLWs | 1st Dose | 1,74,36,514 |
2nd Dose | 93,79,246 | |
Age Group 18-44 years | 1st Dose | 8,34,29,067 |
2nd Dose | 18,56,720 | |
Age Group 45-59 years | 1st Dose | 8,68,82,578 |
2nd Dose | 1,46,35,430 | |
Over 60 years | 1st Dose | 6,74,40,309 |
2nd Dose | 2,33,03,128 | |
Total | 32,17,60,077 |
తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేసుకునేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటి 49 లక్షల 6 వేల 162 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. కోటి 19 లక్షల 86 వేల 45 మందికి మొదటి డోస్ అందగా.. 29 లక్షల 20 వేల 117 మందికి రెండో డోస్ కూడా పూర్తైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటి 4 లక్షల 79వేల 569 మందికి వ్యాక్సినేషన్ అందింది. అందులో మొదటి డోస్ పూర్తైన వారు 89 లక్షల 86 వేల 779 మంది కాగా.. రెండో డోస్ పూర్తైన వారు 14 లక్షల 92 వేల 790 మంది ఉన్నారు.
ఇక ఏ కంపెనీ వ్యాక్సిన్లు ఎన్ని అందాయనే వివరాలు గమనిస్తే.. 28 కోట్ల 09 లక్షల 72 వేల 775 మందికి covisheild అందితే.. 3 కోట్ల 84 లక్షల 5 వేల 394 మందికి covaxine వ్యాక్సిన్లు అందాయి.
వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నంటున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దేశంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 34 కోట్లు దాటింది. ఆ వివరాలు చూస్తే.. 34 కోట్ల 29 లక్షల 54 వేల 715 మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 16 కోట్ల 12 లక్షల 75 వేల 241 మంది.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య గ్రూప్ వారు అయితే.. 18 కోట్ల 16 లక్షల 79 వేల 472 మంది 45 ఏళ్ల పై బడిన వారు.
అందరికి వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోండి.. కరోనా మహమ్మారిని దరిచేరనివ్వకండి..
Read Also… AP Weather Report: ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతంలో వర్షాలు పడే ఛాన్స్..