దేశంలో కరోనా పాజిటివ్ రేటు 6.73 శాతం..

| Edited By:

Jul 06, 2020 | 10:11 PM

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదువుతన్నాయి. ఇక మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే కరోనా బారినపడి మరణించిన..

దేశంలో కరోనా పాజిటివ్ రేటు 6.73 శాతం..
Follow us on

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదువుతన్నాయి. ఇక మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య ఇరవై వేలకు చేరువయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలకు చేరువైంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో మూడో స్థానానికి చేరుకుంది. నిన్నటి వరకు మూడో స్థానంలో ఉన్న రష్యాను అధిగమించి.. భారత్ మూడో స్థానానికి చేరుకుంది. ఇక మనకంటే ముందు అమెరికా, బ్రెజిల్ ఉన్నాయి. కాగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు భారత్‌లో నమోదవుతున్న కేసుల విషయంపై స్పందించారు. దేశంలో కరోనా పరీక్షలు పెంచామని.. పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే వైద్య చికిత్స అందిస్తున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు దేశంలో కరోనా
కేసుల పాజిటివ్ రేటు 6.73 శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు.