Indian Railways: దేశంలో పేరు లేని ఏకైక రైల్వే స్టేషన్ ఇది.. దాని వెనుక కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!

|

Jan 13, 2022 | 10:54 PM

Indian Railways: మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఏం చెబుతారు? ఎవరైనా తాము వెళ్లే ప్రాంతం పేరు చెబుతారు. పేరు అనేది ఒక గుర్తింపు.

Indian Railways: దేశంలో పేరు లేని ఏకైక రైల్వే స్టేషన్ ఇది.. దాని వెనుక కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!
Follow us on

Indian Railways: మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఏం చెబుతారు? ఎవరైనా తాము వెళ్లే ప్రాంతం పేరు చెబుతారు. పేరు అనేది ఒక గుర్తింపు. మనిషికి అయినా, జంతువుకు అయినా, ప్రాంతానికైనా.. మరేదేనికైనా పేరు కీలకం. దాదాపు పేరు లేకుండా ఏదీ లేదనే చెప్పాలి. ముఖ్యంగా.. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లకు పేరు తప్పనిసరిగా ఉంటాయి. మరి పేరు లేని రైల్వే స్టేషన్‌ను ఎప్పుడైనా చూశారా? పోనీ విన్నారా? మీ ఆన్సర్ నో అయితే ఇప్పుడు తెలుసుకోండి.

31 మార్చి 2017 నాటికి దేశంలో మొత్తం 7349 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అయితే వీటిలో ఒక రైల్వే స్టేషన్‌కు మాత్రం ఇప్పటికీ పేరు లేదు. అవును.. మీరు చూసేది నిజమే. స్టేషన్‌కు పేరు లేకుండా ఉండటం ఏంటనే మీ సందేహం ఇప్పుడు ఆ మ్యాటర్‌లోకి వెళదాం. ఈ పేరు లేని రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బుర్ద్వాన్ జిల్లా హెడ్ క్వార్టర్‌ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఈ రైల్వే స్టేషన్ రేనా అనే గ్రామంలో ఉంది. ఇండియన్ రైల్వేస్.. ఈ స్టేషన్‌ను 2008లో నిర్మించింది. అయితే, ఆ స్టేషన్‌కు పేరు మాత్రం పెట్టలేదు. అప్పటి నుంచి అది పేరు లేని రైల్వే స్టేషన్‌గానే మిగిలిపోయింది.

అయితే, పేరు పెట్టకపోవడానికి పెద్ద కారణమే ఉందండోయ్. ఈ స్టేషన్ రేనా గ్రామం, రాయినగర్ గ్రామాల సరిహద్దుల్లో ఉంది. దాంతో పేరు విషయంలో ఇరు గ్రామాల ప్రజలు భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఈ కన్‌ఫ్యూజన్‌లో ఆ స్టేషన్‌కు పేరే పెట్టకుండా ఉండిపోయింది. వాస్తవానికి 2008 సంవత్సరానికి ముందు, రాయ్‌నగర్ రైల్వే స్టేషన్ పేరుతో రాయినగర్‌లో రైల్వే స్టేషన్ ఉండేది. అయితే, ట్రైన్ ఆగిన 200 మీటర్ల ముందు నారో గేజ్ మార్గం ఉంది. దీనిని బంకురా-దామోదర్ రైల్వే రూట్ అని పిలిచేవారు.

ఆ తరువాత అక్కడ బ్రాడ్ గేజ్ నిర్మించిన సమయంలో రేనా గ్రామం సరిహద్దుల్లో కొత్త రైల్వే స్టేషన్ నిర్మించారు. తర్వాత దీనిని మసాగ్రామ్ సమీపంలోని హౌరా-బర్ధమాన్ మార్గానికి అనుసంధానించారు. అయితే, స్టేషన్‌కు పేరు పెట్టాలని భావించగా.. రేనా గ్రామ ప్రజలు దీనికి రాయినగర్ అని పేరు పెట్టొద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టేషన్ తమ గ్రామంలోనే ఉందని, తమ గ్రామం పేరుతోనే స్టేషన్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కారణంగా ఇప్పటి వరకు ఈ స్టేషన్‌కు పేరు పెట్టలేదు. కాగా, ఈ స్టేషన్ వద్ద రోజుకు ఆరు రైల్లు ఆగుతాయని స్టేషన్ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే.. ఇప్పటికీ ఆ స్టేషన్‌కు పేరు లేకుండా ఉంది. స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన బోర్డు.. ఖాళీగా దర్శనం ఇస్తుంటుంది.

Also read:

Tirupati Airport: నిజమే అని తేలితే సీరియస్ యాక్షన్.. తాగునీరు నిలిపివేసిన ఘటనపై కేంద్ర మంత్రి ట్వీట్..

IPL 2022: లక్నో టీంలో కేఎల్ రాహుల్‌తో చేరనున్న ఇద్దరు.. వారెవరంటే?

Policeman Chase: కిర్రాక్ పోలీస్.. పారిపోతున్న దొంగను ఎలా చేజ్ చేసి పట్టుకున్నాడో మీరే చూడండి..