IRCTC/Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. ఫెస్టివల్ సీజన్‌లో ప్రత్యేక రైళ్లు

|

Sep 01, 2021 | 5:18 PM

Indian Railways News: రైల్వే ప్రయాణీకులకు రైల్వే శాఖ తీపికబురు అందించింది. రానున్న ఫెస్టివల్ సీజన్‌లో దేశ వ్యాప్తంగా పలు మార్గాల్లో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది. 

IRCTC/Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. ఫెస్టివల్ సీజన్‌లో ప్రత్యేక రైళ్లు
Indian Railways
Follow us on

Indian Railways News – Festival Special Trains: రైల్వే ప్రయాణీకులకు రైల్వే శాఖ తీపికబురు అందించింది. రానున్న ఫెస్టివల్ సీజన్‌లో దేశ వ్యాప్తంగా పలు మార్గాల్లో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది.  ఫెస్టివల్ సీజన్‌లో 450కి పైగా ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణానికి ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) ద్వారా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. సెప్టెంబరు 1 నుంచి ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. పండుగల సీజన్ నేపథ్యంలో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ప్రత్యేక రైళ్ల టైమ్ టేబుల్‌ను రైల్వే శాఖ త్వరలోనే విడుదల చేయనున్నట్లు రైల్వే శాఖ అధికార వర్గాలు తెలిపాయి.

కోవిడ్ నిబంధనల నేపథ్యంలో మునుపటి కంటే ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ అధికారులు నిర్ణయించారు. ప్రయాణీకుల రద్దీ కారణంగా కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వెయిటింగ్ టికెట్స్ కలిగిన ప్రయాణీకులు రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతించరు. కన్ఫర్మ్ టికెట్ కలిగిన ప్రయాణీకులు మాత్రమే రైళ్లలో ప్రయాణించవచ్చు. రైల్వే ప్రయాణీకుల కోసం ప్రీమియం టికెట్స్ కూడా అందుబాటులో ఉంచనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.

ప్రత్యేక రైళ్ల కారణంగా ఆన్‌లైన్ బుకింగ్స్‌తో ఐఆర్‌సీటీసీ మంచి లాభాలు ఆర్జించే అవకాశముంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు రైళ్లు రద్దుకావడంతో ఐఆర్‌సీటీసీ ఢీలా పడింది. ఇప్పుడు రైళ్లలో ప్రయాణాలు జోరందుకోవడంతో ఆ మేరకు ఆ సంస్థకు లబ్ధి చేకూరనుంది.

Also Read..

రాగల 3 రోజులలో ఏపీలో భారీ వర్షాలు.. విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలకు భారీ వర్ష సూచన

మంచు పర్వతాల్లో ఎలుగుబంటిని చుట్టుముట్టిన తోడేళ్లు.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!