Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఏప్రిల్‌ 1 నుంచి పట్టాలెక్కనున్న 22 ప్రత్యేక రైళ్లు

|

Feb 25, 2021 | 2:36 AM

Special Trains: రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. కరోనా కాలంలో రద్దు చేసిన పలు రైళ్లను కొన్ని కొన్నిగా పునరుద్దరిస్తూ వస్తోంది రైల్వే శాఖ. ఇప్పుడు తాజాగా...

Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఏప్రిల్‌ 1 నుంచి పట్టాలెక్కనున్న 22 ప్రత్యేక రైళ్లు
Follow us on

Special Trains: రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. కరోనా కాలంలో రద్దు చేసిన పలు రైళ్లను కొన్ని కొన్నిగా పునరుద్దరిస్తూ వస్తోంది రైల్వే శాఖ. ఇప్పుడు తాజాగా 22 రైళ్లు మళ్లీ పట్టాలెక్కనున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి ఈ 22 ప్రత్యేక రైళ్లు పునరుద్దరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. కోవిడ్‌ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల పేరిట దశల వారీగా రైళ్లను పునరుద్దరిస్తున్నట్లు తెలిపింది. కోవిడ్‌కు ముందు జోన్‌ నుంచి 291 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడిచేవి. వీటిలో ప్రత్యేక రైళ్ల పేరిట ఇప్పటి వరకు 170 రైళ్లను పునరుద్దరించింది. ఇక తాజాగా ఏప్రిల్‌ 1 నుంచి 22 రైళ్లను పునః ప్రారంభించనున్నారు. వీటిలో సికింద్రాబాద్‌, విశాఖ మధ్య నడిచే గరీబ్‌ రథ్‌ రైళ్లు కూడా ఉన్నాయి. ఔరంగాబాద్‌-రేణిగుంట, నాందేడ్‌-హజ్రత్‌ నిజాముద్దీన్‌, సికింద్రాబాద్‌-విజయవాడ, గుంటూరు-కాచిగూడ, సికింద్రాబాద్‌-విశాఖ, ఆదిలాబాద్‌-నాందేడ్‌, సికింద్రాబాద్‌-యశ్వంత్‌పూర్‌, జియవాడ-షిర్డీ, నాందేడ్‌-శంట్రగచ్చి, నాందేడ్‌-ఔరంగాబాద్‌, నాందేడ్‌-శ్రీగంగానగర్‌ మధ్య ఈ 22 రైళ్లు మళ్లీ పట్టాలెక్కి పరుగులు పెట్టనున్నాయి.

కరోనా ఎఫెక్ట్‌లో రైళ్లు రద్దు..

కాగా, గత ఏడాదిగా అతలాకుతలం చేసిన కరోనా మమహ్మారి కారణంగా దేశంలో పలు రైళ్లు రద్దు అయ్యాయి. కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో రైళ్లన్నీ రద్దు అయ్యాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా మళ్లీ రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. రద్దయిన రైళ్లు ఒక్కొక్కటిగా పునరుద్దరిస్తున్నారు రైల్వే శాఖ అధికారులు.

Also Read: Fastag, Paytm: టోల్‌ ప్లాజాల ద్వారా 2.6 లక్షల మంది నుంచి తప్పుగా వసూలు చేసిన టోల్‌ ఛార్జీలు పేటీఎమ్‌ రీఫండ్‌