Breaking: జూన్ 1 నుంచి తిరగనున్న ప్యాసింజర్ రైళ్లు..!

లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఇప్పటికే రాష్ట్రాల్లో బస్సులు తిప్పేందుకు ఓకే చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. రైళ్లు నడిపేందుకు కూడా సిద్దమవుతోంది.

Breaking: జూన్ 1 నుంచి తిరగనున్న ప్యాసింజర్ రైళ్లు..!

Updated on: May 19, 2020 | 10:08 PM

లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఇప్పటికే రాష్ట్రాల్లో బస్సులు తిప్పేందుకు ఓకే చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. రైళ్లు నడిపేందుకు కూడా సిద్దమవుతోంది. ప్రస్తుతం వలస కార్మికుల కోసం శ్రామిక్‌ రైళ్లు, స్పెషల్ ట్రైన్స్‌ మాత్రమే తిరుగుతుండగా.. జూన్ 1 నుంచి ప్యాసింజర్ రైళ్లు నడపబోతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 200 నాన్- ఏసీ సెకండ్ రైళ్లు జూన్ 1వ తేది నుంచి తిరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. దేశంలోని ప్రతి ఒక్కరికి ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ కూడా తెలిపింది. కాగా కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైళ్లు ప్రయాణాలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో ఆ మధ్యన రైళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రైళ్లను నడపడం వలన కరోనా విజృంభణ మరింత పెరిగే అవకాశం ఉందని కేసీఆర్ సహా పలువురు ముఖ్యమంత్రులు తెలపడంతో.. జూన్ 30 వరకు ప్రయాణికులు బుక్‌ చేసిన టికెట్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఆ డబ్బులు మొత్తాన్ని ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Read This Story Also: కరోనా అప్‌డేట్స్: తెలంగాణలో కొత్తగా 42 పాజిటివ్ కేసులు..!

Loading...
Unable to load recommendations.
Follow Us