Indian Railways: పట్టాలెక్కిన తొలి ప్రైవేటు రైలు.. నోరూరించే వంటకాలతో పాటు మరెన్నో సౌకర్యాలు

|

Jun 15, 2022 | 11:55 AM

రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించిన భారత్‌ గౌరవ్‌ పథకం కింద దేశంలోనే తొలి రైలును మంగళవారం సాయంత్రం కోయంబత్తూరు నార్త్‌ రైల్వే స్టేషన్‌ నుండి జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు

Indian Railways: పట్టాలెక్కిన తొలి ప్రైవేటు రైలు.. నోరూరించే వంటకాలతో పాటు మరెన్నో సౌకర్యాలు
Indian Railways
Follow us on

కోయంబత్తూరు: రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించిన భారత్‌ గౌరవ్‌ పథకం కింద దేశంలోనే తొలి రైలును మంగళవారం సాయంత్రం కోయంబత్తూరు నార్త్‌ రైల్వే స్టేషన్‌ నుండి జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు కోయంబత్తూర్‌ నార్త్‌ నుంచి సాయినగర్‌ షిర్డీ టూరిస్ట్‌ సర్క్యూట్‌లో నడుస్తుంది.ఇక ఈ రైలుకు సంబంధించి పూర్తి డిటెల్స్‌ పరిశీలించినట్టయితే,…

Bharat Gaurav

కోయంబత్తూరు నార్త్‌ నుంచి సాయినగర్‌ శిర్డీకి తొలి ప్రైవేటు రైలు బయలుదేరింది. కేంద్రం ‘భారత్‌ గౌరవ్‌’ పథకం కింద ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు రైలు ఇదే.5 రోజుల పాటు ప్యాకేజీ టూర్‌ కింద ఇందులో ప్రయాణించొచ్చని దక్షిణ రైల్వే తెలిపింది. 100 మంది ప్రయాణికులతో ‘దేఖో అప్నా దేశ్‌’ పేరిట నిన్న సాయంత్రం 6 గంటలకు కోయంబత్తూరు నార్త్‌లో బయలుదేరిన రైలు సాయినగర్‌ శిర్డీకి రేపు ఉదయం 7.25 గంటలకు చేరుతుంది. తిరుపూరు, ఈరోడ్‌, సేలం, ఎలహంక, ధర్మవరం, మంత్రాలయం రోడ్‌, వాడి మీదుగా వెళ్తుంది. కోయంబత్తూరు నుంచి వెళ్లేటప్పుడు మంత్రాలయం రోడ్‌లో మంత్రాలయం ఆలయ సందర్శనార్థం 5 గంటల పాటు ఆగుతుంది.

Indian Railways 1

తిరుగు ప్రయాణంలో సాయినగర్‌ శిర్డీలో 17వ తేదీ ఉదయం 7.25 గంటలకు బయలుదేరి కోయంబత్తూరు నార్త్‌కు 18న మధ్యాహ్నం 12 గంటలకు చేరుతుంది. ఈ ట్రైన్‌లో ఆధునిక హంగులతో బోగీలు , అందుబాటులో వైద్యుడు, రైల్వే పోలీసులతో పాటు ప్రైవేటు భద్రతా సిబ్బంది, ఏసీ మెకానిక్‌, అగ్నిమాపక సిబ్బంది ఉంటారు. రుచికరమైన శాఖాహార వంటకాలు. ప్యాకేజీలో భాగంగా వీఐపీ దర్శనం, బస్సు వసతులు, ఏసీ బస వసతితో పాటు టూరిస్టు గైడ్లను అందుబాటులో ఉంచుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి