Railway Passenger Alert: భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా.. ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించి పునరుద్ధరించారు. ఈ వివరాలను దక్షిణ మధ్య రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. రాజంపేట – నందలూరు మార్గంలో వరదల కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం నెలకొంది. దీంతో ఇవాళ (23 నవంబర్) రైలు నెం.17416 కొల్లాపూర్ SCSMT – తిరుపతి రైలును రద్దు చేశారు. అలాగే బెంగళూరు కంటోన్మెంట్ నుంచి అగర్తలాకు మంగళవారంనాడు నడిచే రైలు (నెం.12503) రాకపోకల సమయాల్లో మార్పులు చేశారు.
SCR PR No. 593 Bulletin no. 59 on “Cancellation / Rescheduling of Trains” @drmgtl pic.twitter.com/HKkkWfVr2l
— South Central Railway (@SCRailwayIndia) November 23, 2021
విజయవాడ – గూడూరు మధ్య నడిచే రైలు నెం.07262, 07261 రైళ్లను మంగళవారంనాడు రద్దు చేశారు.
SCR PR No.592 Bulletin no. 58 on “Cancellation of Trains” @VijayawadaSCR pic.twitter.com/EkiWm5ni3m
— South Central Railway (@SCRailwayIndia) November 23, 2021
తిరుపతి – సాయినగర్ షిర్డి మధ్య మంగళ, బుధవారాల్లో నడిచే రైళ్లను ( నెం.17417, 17418) పునరుద్ధరించారు. ఈ రైళ్లు పాకాల, ధర్మవరం, గుత్తి మీదుగా నడుస్తాయి. అలాగే యశ్వంత్‌పూర్ – హౌరా మధ్య మంగళవారంనాడు నడిచే రైళ్లు (నెం.12246, 12864)ను రద్దు చేశారు.
Bulletin no.56&57 on “Restoration, Diversion and Reschedule of Trains” @drmgtl @VijayawadaSCR pic.twitter.com/p2jKPfzch4
— South Central Railway (@SCRailwayIndia) November 23, 2021
అలాగే మంగళవారంనాడు నడిచే చెన్నై సెంట్రల్ – సీఎస్టీ ముంబై, చెన్నై సెంట్రల్ – ఎల్‌టీటీ ముంబై, సీఎస్‌టీ ముంబై – చెన్నై సెంట్రల్, ఎల్‌టీటీ ముంబై – చెన్నై సెంట్రల్, బిలాస్‌పూర్ – తిరునెల్వేలి రైళ్లు రద్దయ్యాయి. అలాగే బుధవారంనాడు బయలుదేరాల్సిన గోరఖ్‌పూర్ – సికింద్రాబాద్ రైలును రద్దు చేశారు.
Cancellation of Trains @VijayawadaSCR @drmsecunderabad @drmhyb pic.twitter.com/LFVmp4lZdR
— South Central Railway (@SCRailwayIndia) November 22, 2021
ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా బికనీర్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇది మంగళవారం సాయంత్రం 07.35 గం.లకు బికనీర్ నుంచి బయలుదేరి గురువారంనాడు ఉదయం 11 గం.లకు హైదరాబాద్ చేరుకుంటుంది.
A fully reserved special train to be run from Bikaner to Hyderabad, for the convenience of passengers.
Train No. 07038 Bikaner – Hyderabad Special will leave Bikaner at 19.35 hrs on 23.11.2021 (Tuesday) and will reach Hyderabad at 11.00 hrs on Thursday.@RailMinIndia @drmbct pic.twitter.com/FOh5TUV1k5
— Western Railway (@WesternRly) November 22, 2021
మరిన్ని రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు..
Bulletin No. 53 SCR PR No. 588 on “Cancellation / Partial Cancellation of Trains ” @VijayawadaSCR @drmgtl pic.twitter.com/y5gzVqE8gU
— South Central Railway (@SCRailwayIndia) November 22, 2021
ALso Read..
Corona: భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఏకంగా 98.32 శాతానికి పెరిగిన రికవరీ రేటు..
Bangarraju Teaser: బంగార్రాజు టీజర్ వచ్చేసింది.. నాగచైతన్య లుక్ అదిరిపోయిందిగా..