Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు షాక్‌.. ఈ ప్రాంతాల్లో రైళ్లు రద్దు!

|

Apr 29, 2022 | 10:53 AM

Indian Railways: రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను ఏర్పాటు చేస్తుంటుంది. అప్పుడప్పడు పలు సాంకేతిక కారణాల వల్లనో, ఇతర కారణాల వల్లనో కొన్ని రైళ్లను రద్దు ..

Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు షాక్‌.. ఈ ప్రాంతాల్లో రైళ్లు రద్దు!
Follow us on

Indian Railways: రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను ఏర్పాటు చేస్తుంటుంది. అప్పుడప్పడు పలు సాంకేతిక కారణాల వల్లనో, ఇతర కారణాల వల్లనో కొన్ని రైళ్లను రద్దు చేస్తుంటుంది. ఇక తాజాగా బిలాస్‌పూర్ నుండి భగత్ కీ కోఠి, బిలాస్‌పూర్ నుండి బికనీర్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేయాలని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నిర్ణయించింది. దీనితో పాటు, అజ్మీర్, జబల్పూర్ మధ్య నడిచే దయోదయ ఎక్స్‌ప్రెస్ వేగాన్ని పెంచాలని నిర్ణయించారు . దయోదయ ఎక్స్‌ప్రెస్ (Dayodaya Express) వేగాన్ని పెంచిన తర్వాత, ఈ రైలు సమయం మారుతుంది.

రద్దు చేయబడిన రైళ్ల వివరాలు:

☛ రైలు నం. 20843, బిలాస్‌పూర్ నుండి భగత్ కీ కోఠి వరకు నడిచే ఈ రైలు మే 2, 3, 9, 10, 16, 17, 23 తేదీల్లో రద్దు చేయబడింది.

☛ రైలు నం. 20844, భగత్ కీ కోఠి నుండి బిలాస్‌పూర్‌కు నడిచే ఈ రైలు ఏప్రిల్‌ 30, మే 5, మే7, మే12, మే 14, మే 19, మే 21, మే 26 మే తేదీల్లో రద్దు చేయబడింది.

☛ రైలు నం. 20845, బిలాస్‌పూర్ నుండి బికనీర్ మధ్య నడిచే ఈ రైలు ఏప్రిల్ 30, మే 5, మే 7, మే 12, మే 14, మే 19, మే 21 మే తేదీల్లో రద్దు చేయబడింది.

☛ రైలు నం. 20846, బికనీర్ నుండి బిలాస్‌పూర్ మధ్య నడిచే ఈ రైలు మే 1, 3, 8, 10, 15, 17, 22, 24 తేదీల్లో రద్దు చేయబడింది.

వేగం పెరిగిన దయోదయ ఎక్స్ ప్రెస్:

అజ్మీర్ , జబల్పూర్ మధ్య నడుస్తున్న దయోదయ ఎక్స్‌ప్రెస్ వేగం 20 ఆగస్టు 2022 నుండి వేగం పెంచనున్నారు. రైలు వేగాన్ని పెంచడం వల్ల పశ్చిమ మధ్య రైల్వే పరిధిలోని స్టేషన్లలో ఆగస్టు 20 నుంచి ఈ రైలు వేళల్లో పాక్షిక మార్పు చేస్తున్నారు.

నార్త్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కెప్టెన్ శశి కిరణ్ ప్రకారం.. రైలు నంబర్-12182, అజ్మీర్-జబల్‌పూర్ దయోదయ ఎక్స్‌ప్రెస్ అజ్మీర్ నుండి ఆగస్టు 20 నుండి 15.30 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు 08.45 గంటలకు బదులుగా 08.30 గంటలకు 15 నిమిషాలు ముందుగా చేరుకుంటుంది. .

ఈ రెండు రైళ్ల వేళల్లో మార్పులు..

రైలు వేగాన్ని పెంచిన తర్వాత బరాన్, ఛబ్రా గుగోర్, రుథియా, గుణ, అశోక్‌నగర్, ముంగోలి, బినా మల్ఖేడి, సాగర్, దామోహ్, కట్నీ ముర్వాడ, సిహోరా రోడ్ రైల్వే స్టేషన్లలో ఆగస్టు 20 నుండి దయోదయ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో పాక్షిక మార్పు ఉంటుంది.

దయోదయ ఎక్స్‌ప్రెస్ వేగాన్ని పెంచిన తర్వాత ఆగస్ట్ 20 నుండి, రైలు నంబర్-15231, బరౌని-గోండియా రైలు 06.40కి కట్ని జంక్షన్‌కు వచ్చి 06.50కి బయలుదేరుతుంది. దీనితో పాటు రైలు నంబర్-18233, ఇండోర్-బిలాస్‌పూర్ రైలు 06.50కి కట్ని సౌత్ స్టేషన్‌కు వచ్చి 06.55కి బయలుదేరుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

SBI: క్రెడిట్‌, డెబిట్‌ కార్డు లావాదేవీల సురక్షితం కోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక మార్గదర్శకాలు!

Pension Scheme: ఈ పథకంలో చేరి ప్రతి నెలా రూ.100 డిపాజిట్ చేయండి.. ఆ తర్వాత రూ.3000 పెన్షన్‌ పొందండి