విజయనగం జిల్లా చీపురుపల్లి మండలం పర్లకు చెందిన గోవింద్.. పానాఘర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో గోవింద్ పారాట్రూపర్స్ ట్రైనింగ్ టీమ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆ విధి నిర్వహణలో అసువులుబాసారు ఏపీ నేవీ కమాండో. ఈ విషాద వార్త అందరినీ కలిచివేస్తోంది. గోవింద్ కుటుంబసభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.
పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాలోని పనాగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో పారాట్రూపర్స్ ట్రైనింగ్ టీమ్‌లో కమాండో గోవింద్ విధులు నిర్వహిస్తోంది. శిక్షణలో భాగంగా ఆయన ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి కిందకి దూకారు. అయితే వందల అడుగుల ఎత్తులో ఉండగా ఆయన ప్యారాచ్యూట్ తెరుచుకోలేదు. అలా అంత ఎత్తు నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలైయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న కమాండో గోవింద్‌ను వెంటనే బార్జోరా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
పనాగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఉన్న వ్యూహాత్మక విమానాల్లో జవాన్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన స్పెషల్ ఫోర్సెస్ యూనిట్లు ఇక్కడ కసరత్తులలో పాల్గొంటాయి. పారాట్రూపర్ల బృందంలో సభ్యులైన గోవింద్.. C130J సూపర్ హెర్క్యులస్ విమానం నుంచి సాధారణ డ్రాప్ సమయంలో అమరులయ్యారు.
ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు నేవీ అధికారులు తెలిపారు. గోవింద్ ధరించిన ప్యారాచూట్ తెరుచుకోవడంలో విఫలమైందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గోవింద్ స్వగ్రామం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్ల గ్రామం. మరోవైపు.. రేపు స్వగ్రామానికి చందక గోవింద్ మృతదేహం చేరుకోనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..