Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్‌కు నీరజ్ చోప్రాను సన్నద్ధం చేసేందుకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?

|

Aug 14, 2021 | 11:52 AM

Tokyo Olympics 2020 - Neeraj Chopra: నీరజ్ చోప్రా.. దేశ వ్యాప్తంగా ఇప్పుడు మార్మోగిపోతున్న పేరు ఇది. ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రాకు దేశ యువతలో మంచి క్రేజ్ ఏర్పడింది.

Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్‌కు నీరజ్ చోప్రాను సన్నద్ధం చేసేందుకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
Neeraj Chopra
Follow us on

నీరజ్ చోప్రా.. దేశ వ్యాప్తంగా ఇప్పుడు మార్మోగిపోతున్న పేరు ఇది. ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రాకు దేశ యువతలో మంచి క్రేజ్ ఏర్పడింది. హర్యానాకు చెందిన 23 ఏళ్ల నీరజ్ చోప్రాకు పలు రాష్ట్రాలు, సంస్థలు భారీ నజరానాలు ప్రకటించాయి.. ప్రకటిస్తూనే ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్‌కు నీరజ్ చోప్రాను సన్నద్ధం చేసేందుకు ట్రైనింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తెలుసా? ఇప్పుడు చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. ఈ వివరాలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) అధికారికంగా వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వం నీరజ్ చోప్రా‌కు ట్రైనింగ్ కోసం రూ.7 కోట్లు వెళ్లించినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. నీరజ్ చోప్రా 450 రోజులు విదేశాల్లో శిక్షణ తీసుకోగా..NSNIS పాటియాలాలోని నేషనల్ కోచింగ్ క్యాంప్‌లో 1,167 రోజులు ట్రైనింగ్ తీసుకున్నారు. దీంతో పాటుగా నీరజ్ చోప్రా కోసం ప్రభుత్వం 177 జావెలిన్స్ సమకూర్చినట్లు ఎస్ఏఐ వెల్లడించింది. అలాగే రూ.74.28 లక్షల విలువైన జావెలిన్ త్రో మెషిన్‌ను నీరజ్ చోప్రాకు ప్రభుత్వం కొనిచ్చినట్లు తెలిపింది.

100 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో అథ్లెటిక్స్ విభాగంలో తొలి స్వర్ణ పతకం సాధించి భారత క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా ఘనత సాధించడం తెలిసిందే. అలాగే వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ అభినవ్ బింద్రా(2008) తర్వాత స్వర్ణ పతకం సాధించిన రెండో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా కావడం విశేషం. తాను పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే 23 ఏళ్ల నీరజ్ స్వర్ణ పతకం సాధించడం విశేషం. కఠోర శిక్షణను ఇలాగే కొనసాగిస్తే ముందుముందు మరిన్ని అంతర్జాతీయ స్థాయి పతకాలు, ఒలింపిక్స్ పతకాలు నీరజ్ సొంతం అవుతాయి.

టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతకం గెలిచిన తర్వాత తనకు అభినందనలు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసిన నీరజ్ చోప్రా..

టోక్యో ఒలింపిక్స్ కోసం నీరజ్ చోప్రా కఠోరమైన శిక్షణ తీసుకున్నాడు. నీరజ్ ట్రైనింగ్‌కు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read..

Scorpion Festival: విచిత్రమైన సాంప్రదాయం.. తేళ్లతో సయ్యాటలు.. ఇలవేల్పుగా పూజలు

థర్డ్‌ వేవ్ ప్రభావమేనా..? పిల్లలపై కరోనా పంజా.. ఆ నగరంలోని తల్లిదండ్రుల్లో ఆందోళన