పాక్‌ ప్రయాణమవుతున్న మాజీ ప్రధాని.. ఎందుకో తెలుసా?

| Edited By:

Oct 03, 2019 | 5:19 PM

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కర్తార్‌పూర్‌లో ఉన్న దర్బార్ సాహిబ్‌కు వెళ్లనున్నారు. పంజాబ్ సీంఎం అమరీందర్‌సింగ్ ఆహ్వానించడంతో ఆయన ప్రయాణంపై క్లారిటీ వచ్చింది. నవంబర్ 12న గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 9న కర్తార్‌పూర్ గురుద్వారాకు తొలివిడత భక్తులతో కలిసి వెళ్లడానికి మన్మోహన్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కర్తార్‌పూర్ కు రావాల్సిందిగా పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖరేషి ఇప్పటికే ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో […]

పాక్‌ ప్రయాణమవుతున్న మాజీ ప్రధాని.. ఎందుకో తెలుసా?
Follow us on

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కర్తార్‌పూర్‌లో ఉన్న దర్బార్ సాహిబ్‌కు వెళ్లనున్నారు. పంజాబ్ సీంఎం అమరీందర్‌సింగ్ ఆహ్వానించడంతో ఆయన ప్రయాణంపై క్లారిటీ వచ్చింది. నవంబర్ 12న గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 9న కర్తార్‌పూర్ గురుద్వారాకు తొలివిడత భక్తులతో కలిసి వెళ్లడానికి మన్మోహన్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కర్తార్‌పూర్ కు రావాల్సిందిగా పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖరేషి ఇప్పటికే ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ వర్గాలు మాత్రం మన్మోహన్ సింగ్ కర్తార్‌పూర్ వెళ్లడం లేదని వెల్లడించారు.

పాకిస్థాన్ దర్బార్ సాహిబ్‌ ఎంతో చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. సిక్కు మత గురువు గురునానక్ తన జీవిత కాలంలో చివరి 18 ఏళ్లు ఇక్కడే సేదతీరినట్టుగా సిక్కులు భావిస్తారు. అందుకే ఈ గురుద్వారాను ప్రతి సిక్కు మతస్తుడు దర్శించుకుంటారు. అయితే దేశ విభజన తర్వాత ఈ ప్రాంతం పాకిస్థాన్‌ కిందికి వెళ్లింది. అయితే భారత్‌లో ఉన్న సిక్కులు దర్శించుకోడానికి గతంలో ఎన్నో ఇబ్బందులు పడాల్సివచ్చేది. దీంతో కర్తార్‌పూర్ కారిడార్ పేరిట నాలుగు లైన్ల రహదారిని నిర్మిస్తోంది.