Poonch Terror Attack: ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల పేర్లు విడుదల.. తోటి జవాన్లకు ఆహారం తీసుకెళ్తూ మృతి..

ఆర్మీ అధికారులు అమరవీరుల పేర్లను ప్రకటించారు.  హవల్దార్ మన్‌దీప్ సింగ్, లాన్స్ నాయక్ దేవాశిష్ బస్వాల్, లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్, సిపాయి హరికిషన్ సింగ్, సిపాయి సేవక్ సింగ్‌ లు అమర సైనికులు అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అమరులైన ఐదుగురు జవాన్లలో నలుగురు పంజాబ్‌కు చెందినవారు కాగా ఒకరు ఒడిశాకు చెందిన వారని పేర్కొంది.

Poonch Terror Attack: ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల పేర్లు విడుదల.. తోటి జవాన్లకు ఆహారం తీసుకెళ్తూ మృతి..
Poonch Terror Attack

Updated on: Apr 21, 2023 | 7:59 AM

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లో గురువారం ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై దాడి చేశారు. జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కుపై గ్రెనేడ్ విసిరి దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. తాజాగా ఆర్మీ అధికారులు అమరవీరుల పేర్లను ప్రకటించారు.  హవల్దార్ మన్‌దీప్ సింగ్, లాన్స్ నాయక్ దేవాశిష్ బస్వాల్, లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్, సిపాయి హరికిషన్ సింగ్, సిపాయి సేవక్ సింగ్‌ లు అమర సైనికులు అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అమరులైన ఐదుగురు జవాన్లలో నలుగురు పంజాబ్‌కు చెందినవారు కాగా ఒకరు ఒడిశాకు చెందిన వారని పేర్కొంది. ఈ సైనికులందరూ నేషనల్ రైఫిల్స్ యూనిట్‌తో సంబంధం కలిగి ఉన్నారు. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం ఈ ప్రాంతాల్లో మోహరించారు.

నగ్రోటాలో ఉన్న ఆర్మీకి చెందిన 16వ కార్ప్స్ మృతుల కుటుంబాలకు వైట్ నైట్ కార్ప్స్ సానుభూతి తెలియజేస్తున్నట్లు ట్వీట్ చేసింది. జమ్మూలోని రాజౌరి సెక్టార్‌లో గురువారం మధ్యాహ్నం ఆర్మీ ట్రక్ భీంబర్ గలీ.. పూంచ్ మధ్య ఉన్న సమయంలో ఈ ఉగ్ర దాడి  సంఘటన చోటు చేసుకుంది. ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

ట్రక్కులో బుల్లెట్ గుర్తులు
గ్రనేడ్ దాడి జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీప ఆస్పత్రిలో జాయిన్ చేశారు. నేరస్థులను కోసం ఆర్మీ అధికారులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అంతేకాదు అధికారులు ప్రయాణిస్తున్న వాహనంపై బుల్లెట్ గుర్తులు కనిపిస్తున్నాయని తెలిపారు. దీంతో పాటు ఘటనా స్థలం నుంచి గ్రెనేడ్ ముక్కలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడి ఉగ్రవాదుల పనే అని తేల్చి చెప్పారు.

దాడికి పాల్పడిన 3 నుంచి 4 మంది ఉగ్రవాదులు
ఈ గ్రనేడ్ దాడికి పాల్పడిన గుంపులో ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం.  మెరుపుదాడిచేసి.. ఆర్మీ వ్యాన్ పై దాడి చేశారు. ఈ దాడికి పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఓవైపు గ్రనేడ్ దాడి చేస్తూనే మరోవైపు సైనికుల దృష్టిని మరల్చడం కోసం మరోవైపు నిరంతరం కాల్పులు జరుపుతూనే ఉన్నారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ జవాన్లు ఇతర జవాన్ల కోసం ఆహారం, నీటిని తీసుకువెళుతున్నారు. ఆ సమయంలో ఉగ్రవాదులు దాడి చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us