కరోనాకు ఆయుర్వేద మందు.. ట్రయల్స్ త్వరలో.. కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్

కరోనా మహమ్మారి చికిత్సకు నాలుగు ఆయుర్వేద మందులను పరీక్షించనున్నట్టు కేంద్ర 'ఆయుష్' మంత్రి శ్రీపాద్ వై.నాయక్ ప్రకటించారు. ట్రయల్స్ ని మరో వారం రోజుల్లో ప్రారంభిస్తామని, ఇందుకు దేశంలోని కొన్ని ఆయుర్వేద సంస్థలు కూడా సహకరించేందుకు...

కరోనాకు ఆయుర్వేద మందు.. ట్రయల్స్ త్వరలో.. కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్

Edited By:

Updated on: May 14, 2020 | 1:40 PM

కరోనా మహమ్మారి చికిత్సకు నాలుగు ఆయుర్వేద మందులను పరీక్షించనున్నట్టు కేంద్ర ‘ఆయుష్’ మంత్రి శ్రీపాద్ వై.నాయక్ ప్రకటించారు. ట్రయల్స్ ని మరో వారం రోజుల్లో ప్రారంభిస్తామని, ఇందుకు దేశంలోని కొన్ని ఆయుర్వేద సంస్థలు కూడా సహకరించేందుకు సిధ్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఆయుర్వేద, యోగ, యునాని, సిధ్ద, హోమియోపతి… ఈ నాలుగు సాంప్రదాయక మందులను కరోనా చికిత్సలో వాడేందుకు చేపట్టే  ప్రయోగాలు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. కరోనాను తరిమివేసేందుకు ఈ దేశీయ మందులు తోడ్పడతాయని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. అయితే ఈ వ్యాధి చికిత్సలో ఆయుర్వేద మందులు ఉపయోగపడతాయా అన్న విషయం శాస్త్రీయంగా తేలాల్సి ఉంది.