
ప్రతి భారతీయుడు రొమ్మువిరిచి నిలబడిన సందర్భం.. పోఖ్రాన్ అణుపరీక్షల సమయం. బట్.. అమెరికా ఆగ్రహించింది. ఏ చిన్న టెక్నాలజీ భారత్‌కు చేరొద్దని ప్రపంచం మొత్తాన్ని భయపెట్టింది. అప్పుడు కూడా ‘నేనున్నాను’ అని పక్కనే నిలబడ్డ ఒకే ఒక్క దేశం రష్యా. 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం జరుగుతున్నప్పుడు.. అమెరికా వార్ షిప్ 70 యుద్ధ విమానాలనేసుకొచ్చి బంగాళాఖాతంలో వాలింది. భారత్‌ను బెదిరించడానికి. అరేబియా సంద్రంలో బ్రిటన్ యుద్ధనౌక ల్యాండ్ అయింది. అమెరికా, బ్రిటన్ భారత్‌ను చుట్టుముట్టినప్పుడు.. అప్పుడు ఎంటర్ అయింది రష్యన్ సబ్‌మెరైన్. ఇక యుద్ధనౌకలు, క్రూయిజర్లు, డెస్ట్రాయర్లతోనూ అండగా నిలిచింది. ఇంకా చాలా ఉన్నాయ్.. భారత్-రష్యా మధ్య స్నేహానికి కారణాలు. అవి కూడా చెప్పుకుందాం. భారత్‌కు దాదాపుగా ప్రతి సందర్భంలోనూ, ప్రతి అంశంలోనూ తోడుగా నిలిచిన దేశం రష్యా. ప్రధానమంత్రులు మారుతున్నా, రష్యాలో పాలకులు మారుతున్నా అదే ధృడమైన బంధం కొనసాగిందిం. కేవలం యుద్ధ సమయాల్లోనే కాదు.. భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించింది కూడా రష్యానే. ఇండియాలో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌కి మరే దేశం చేయలేని సాయం అందించింది రష్యా. ఇప్పుడున్న భిలాయ్ ఉక్కు కర్మాగారం, బొకారో స్టీల్ సిటీ రష్యా అందించింన టెక్నికల్ సపోర్ట్‌తో కట్టుకున్నదేవ. బాక్రా నంగల్ డ్యామ్.. దేశంలోనే అతిపెద్ద ఆనకట్టను నిర్మించకోగలిగాం అంటే కారణం రష్యా. కుడంకుళం అణు విద్యుత్ ప్లాంట్‌కు కావాల్సిన టెక్నికల్ అండ్ మేనేజ్‌మెంట్ సపోర్ట్ ఇచ్చింది. పోఖ్రాన్ అణుపరీక్ష తరువాత భారత్‌పై అమెరికా ఆంక్షలు...