India Coronavirus updates: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. నిత్యం రికార్డుస్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో (బుధవారం) కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా 3,14,835 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 2,104 మంది మరణించారు. దేశంలో కోవిడ్ ప్రారంభం నాటినుంచి అత్యధిక కోవిడ్ -19 కేసులు మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,59,30,965 (1.59 కోట్లు) కు చేరగా.. మరణాల సంఖ్య 1,84,657 కి పెరిగింది. కేవలం 17 రోజుల్లోనే రోజువారి కేసుల సంఖ్య లక్ష నుంచి 3 లక్షల దాటడం ఈ మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రపంచంలో అత్యధికంగా భారత్‌లో కేసులు నమోదయ్యాయి.
కాగా.. నిన్న కరోనా నుంచి 1,78,841 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,34,54,880 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 22,91,428 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా.. 13,23,30,644 డోసులను లబ్ధిదారులకు ఇచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కాగా.. బుధవారం దేశవ్యాప్తంగా 16,51,711 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఏప్రిల్ 21 వరకు మొత్తం 27,27,05,103 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది.
Also Read: