Coronavirus: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

|

Apr 05, 2022 | 9:38 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కరోనా థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ రోజు కూడా వేయికి దిగువగానే

Coronavirus: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
India Coronavirus Updates
Follow us on

India Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కరోనా థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ రోజు కూడా వేయికి దిగువగానే కేసుల సంఖ్య నమోదైంది. గడిచిన 24 గంటల్లో 795 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి (Coronavirus) కారణంగా నిన్న 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 12,054 (0.03%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో డైలీ పాజిటివిటీ రేటు కూడా భారీగా తగ్గింది. 0.17 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,30,29,839 కి పెరిగాయి. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,21,416 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 1,208 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,24,96,369 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.76 శాతం ఉంది.

ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,84,87,33,081 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా నిన్న 4,66,332 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు దేశంలో 79.15 కోట్ల పరీక్షలు చేసినట్లు వైద్య శాఖ తెలిపింది.

Also Read:

Viral Video: చూసుకోవాలి కదమ్మా..! ముక్కు పగిలింది.. అద్దం బద్దలైంది.. ఫన్నీ వీడియో