Omicron: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ వ్యాప్తి.. ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?

India Coronavirus Updates: దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చూస్తుండగానే కేసుల

Omicron: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ వ్యాప్తి.. ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?
Omicron

Updated on: Dec 28, 2021 | 9:59 AM

India Coronavirus Updates: దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చూస్తుండగానే కేసుల సంఖ్య పదుల నుంచి వందలకు చేరింది. భారత్‌లో ఇప్పటివరకు 653 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయని కేంద్రఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో 21 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. అయితే.. ఇప్పటివరకు 186 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, గుజరాత్, రాజస్థాన్లో ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 167 కేసులు నమోదు కాగా.. ఢిల్లీలో 165 కేసులు ఉన్నాయి. కేరళలో 57 కేసులు, తెలంగాణలో 55, గుజరాత్‌లో 49, రాజస్థాన్‌లో 46 కేసులు నమోదయ్యాయి.

ఇదిలాఉంటే.. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. ఇటీవల కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. రోజూ 10వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నా.. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సోమవారం దేశంలో కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో (సోమవారం) దేశవ్యాప్తంగా 6,358 కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా నుంచి 6,450 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 75,456 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే.. దేశంలో రికవరీ రేటు 98.40 శాతానికి చేరింది. మార్చి తర్వాత రికవరీ రేటు భారీ స్థాయిలో పెరిగినట్లు కేంద్రం తెలిపింది.

Also Read:

Viral Video: చాలాకాలం తర్వాత సంరక్షకుడిని చూసి ఏనుగుల భావోద్వేగం.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో..

Health Tips: పండ్లు తినే సమయంలో ఈ తప్పులు చేయకండి.. ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు రావొచ్చు..