Coronavirus Updates In India: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు లక్షల్లో నమోదైన కేసులు కాస్త.. ప్రస్తుతం 50వేలకు దిగువన కేసులు నమోదవుతున్నాయి. కాగా సోమవారంతో పోల్చుకుంటే.. కరోనా కేసులు మరలా పెరిగాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల వ్యవధిలో (మంగళవారం) 38,792 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా.. 624 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాలతో.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,09,46,074 కి చేరగా.. మరణాల సంఖ్య 4,11,408 కి పెరిగింది.
కాగా నిన్న కరోనా నుంచి 41,000 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారిసంఖ్య మొత్తం 3,01,04,720కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 4,29,946 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 19,15,501 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటి వరకూ 43,59,73,639 నిర్ధరాణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
India reports 38,792 new #COVID19 cases, 41,000 recoveries, and 624 deaths in the last 24 hours, as per Health Ministry
Total cases: 3,09,46,074
Total recoveries: 3,01,04,720
Active cases: 4,29,946
Death toll: 4,11,408Total vaccinated: 38,76,97,935 (37,14,441 in last 24 hrs) pic.twitter.com/wroOjdz1hc
— ANI (@ANI) July 14, 2021
Also Read: