
Covid-19 Cases in India: భారత్‌లో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతూనే ఉంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ ఇటీవల కాలంలో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో థర్డ్‌వేవ్ ప్రమాదం పొంచివుందని జాగ్రత్తలు పాటించాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారంతో పోల్చుకుంటే.. గురువారం కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్నటితో పోల్చుకుంటే.. 9 వేల కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 34,973 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. కరోనా మహమ్మారి కారణంగా 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
India reports 34,973 fresh #COVID19 cases, 37,681 recoveries and 260 deaths in the last 24 hours, as per Union Health Ministry
Active cases: 3,90,646
Total cases: 3,31,74,954
Total recoveries: 3,23,42,299
Death toll: 4,42,009Total vaccination: 72,37,84,586 pic.twitter.com/btlZzJI3j6
— ANI (@ANI) September 10, 2021
కాగా.. దేశంలో నమోదవుతున్న కేసులు, మరణాల్లో 80 శాతానికి పైగా కేరళ రాష్ట్రంలో నమోదవుతున్నాయి. గురువారం కేరళలో 26,200 కరోనా కేసులు నమోదు కాగా.. 114 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read: