India Coronavirus: దేశంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం.. గత 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

India Covid-19 Updates: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారి

India Coronavirus: దేశంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం.. గత 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
India Corona Cases

Updated on: Jan 22, 2022 | 9:47 AM

India Covid-19 Updates: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసుల సంఖ్య మూడు లక్షలకుపైగా నమోదవుతున్నాయి. కాగా.. గడిచిన 24 గంటల్లో (శుక్రవారం) కేసుల సంఖ్య కాస్త తగ్గింది. దేశవ్యాప్తంగా నిన్న 3,37,704 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 488 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారంతో పోల్చుకుంటే.. శుక్రవారం కేసులు, మరణాల సంఖ్య తగ్గింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. దేశంలో పాజిటివిటి రేటు గణనీయంగా పెరుగుతోంది. రోజూవారి పాజిటివిటీ రేటు 17.22% శాతం ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ప్రస్తుతం దేశంలో 21,13,365 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 2,42,676 మంది బాధితులు కోలుకున్నారు. తాజగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 38903748 కి చేరింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 488884 మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో 36291435 మంది కోలుకున్నారనని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 93.31 శాతంగా ఉంది.

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 10,050 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గురువారంతో పోల్చుకుంటే.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3.69 శాతం పెరిగింది.

Also Read:

Co-WIN portal: కోవిన్ పోర్టల్ సురక్షితం.. ఎలాంటి డేటా లీక్ కాలేదు.. స్పష్టం చేసిన కేంద్రం

Hyderabad: కొట్టెసిన స్కూటీతో దర్జాగా దొంగతనాలు చేసి చెక్కేశాడు.. మరి పోలీసులు ఏం చేస్తున్నారంటే..