Corona Virus: పంజా విసురుతున్న కరోనా..24 గంటల్లో 10 వేలకు పైగా కేసులు నమోదు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా పని ముగిసింది అని అనుకనే లోపే ఆ మహమ్మారి తన రూపాన్ని మార్చుకుంటూ మళ్లీ పంజా విసురుతోంది.

Corona Virus: పంజా విసురుతున్న కరోనా..24 గంటల్లో 10 వేలకు పైగా కేసులు నమోదు
Corona Virus

Updated on: Apr 13, 2023 | 10:30 AM

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా పని ముగిసింది అని అనుకనే లోపే ఆ మహమ్మారి తన రూపాన్ని మార్చుకుంటూ మళ్లీ పంజా విసురుతోంది. గత వారం రోజులుగా 6 వేలకు పైగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో 10,158 కొత్త కేసులు నమోదయ్యాయి. 19 మంది మృతి చెందారు. దీంతో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 44,000 దాటిపోయింది.

మరోవైపు కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందడంపై విశ్లేషకులు స్పందిస్తున్నారు. కరోనా నుంచి మరో ముప్పు వచ్చేలా అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే కొంత ఉపశమనం కలిగించే విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చిన కరొనా కొత్త వేరియంట్‌తో అంత ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా కేసులపై ఆందోళన చెందాల్సిన అవరసరం లేదని కరోనా జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం