LoC వెంబడి సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్‌ దాడులు.. 50 డ్రోన్లను కూల్చివేసిన భారత సైన్యం!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్‌-పాక్‌ సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడటంతో భారత సైన్యం 50కి పైగా డ్రోన్లను కూల్చివేసింది. భారత సరిహద్దులను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ చేసిన దాడులను అడ్డుకున్నట్టు భారత భద్రతా బలగాలు వెల్లడించినట్టు తెలుస్తోంది.

LoC వెంబడి సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్‌ దాడులు.. 50 డ్రోన్లను కూల్చివేసిన భారత సైన్యం!
India Pakistan Conflict

Updated on: May 09, 2025 | 9:19 AM

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాకిస్తాన్ మధ్య మొదలైన ఉద్రిక్త పరిస్థిస్తులు, ఆపరేషన్ సిందూర్’ తర్వాత మరింత తీవ్రస్థాయికి చేరాయి. ఈ పరిస్థితులు రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో సైనిక స్థావరాలపై పాక్ దాడులు చేసేందుకు ప్రయత్నించింది. సరిహద్దు రాష్ట్రాల్లోని ఉధంపూర్‌, సాంబా, జమ్ము, అఖ్నూర్‌, నగ్రోటా, పఠాన్‌కోట్ ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు పాల్పడింది. అప్రమత్తమైన భారత భద్రత బలగాలు పాకిస్తాన్ డ్రోన్లను గాళ్లోనే కూల్చివేశారు. పాక్‌ నుంచి భారత్‌లోకి వచ్చిన సుమారు 50కిపైగా డ్రోన్లను కూల్చివేసినట్టు భాతర భద్రతా బలగాలు వెల్లడించినట్టు తెలుస్తోంది.

జమ్మూ కాశ్మీర్‌, సహా రాజస్థాన్‌లోని రామ్‌గర్, జైసల్మేర్‌లోని బీఎస్‌ఎఫ్‌ క్యాంపులపై డ్రోన్లతో దాడి చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. కాగా బీఎస్‌ఎఫ్‌ క్యాంపులపై దాడికి యత్నించిన డ్రోన్లను భారత భద్రతా బలగాలు సమర్థవంతంగా కూల్చివేసినట్టు తెలుస్తోంది.

సరిహద్దు రాష్ట్రాల్లోని జిల్లాలే లక్ష్యంగా పాకిస్తాన్ పంపిన డ్రోన్లను అధునాతన ఆయుధాల సాయంతో భారత సైన్యం కూల్చివేసింది. పాకిస్తానీ డ్రోన్లను కూల్చివేసేందుకు భారత భద్రతా దళాలు L-70 తుపాకులు, Zu-23mm, షిల్కా వ్యవస్థలు, ఇతర అధునాతన కౌంటర్-UAS పరికరాలను ఉపయోగించాయి.

పహల్గామ్ ఉగ్రదాడికి పతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ తర్వాత.. బుధవారం రాత్రి భారత్‌ సరిహద్దు ప్రాంతాల్లోని 15 సైనిక స్థావరాలపై పాకిస్తాన్ దాడి చేయడానికి ప్రయత్నించడంతో ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అయ్యారు. భారత్‌లోని సైనిక స్థావరాల లక్ష్యంగా పాకిస్తాన్‌ చేసిన దాడిని భారత భద్రతా దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. ఇక గురువారం పాకిస్తాన్‌లోని వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్న భారత్‌..లాహోర్‌లోని పాక్‌ రక్షణ వ్యవస్థపై దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..