జూన్ 1న దేశంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తాము భావించట్లేదని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 4న రుతుపవనాలు ప్రవేశిస్తాయని..అలాగే ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ఈ మేరకు వివరాలను ఐఎండీ వెల్లడించింది. ఈ ఏడాది వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.అలాగే వచ్చే వారం రోజుల్లో కూడా అరేబియా సముద్రంలో తుఫాను వచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. అయితే ఉత్తరాదిన రుతుపవనాలకు ముందే వర్షాలు పడడానికి కారణం పాశ్చాత్య దేశాల్లోని వాతావరణ అసమతుల్యతేనని తెలిపింది.
పాశ్చాత్య దేశాల్లో వాతావరణ సమతుల్యత వల్లే భారత్‌లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ పేర్కొంది. అందుకే ఢిల్లీతో పాటు చుట్టుపక్క నగరాలు వర్షంతో కాస్త ఉపశమనాన్ని పొంతుందున్నాయని చెప్పింది. ఒకవేళ దేశం మొత్తం ఒకే తరహాలో వర్షపాతం నమోదైతే అనుకూల పరిస్థితులే ఉంటాయని.. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదని తెలిపింది. అలాగే వ్యవసాయంపై కూడా ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం