గ్రామీణ ప్రాంత పేదవాడి జీవితం రోజుకు కేవలం రూ.45 మాత్రమే.. NSSO సర్వేలో కీలక విషయాలు!

ఈ వృద్ధిని పరిశీలిస్తే, గ్రామీణ జనాభా సగటు నెలవారీ గృహ వ్యయంలో 164 శాతం పెరుగుదల నమోదైంది. అయితే పట్టణ జనాభా వ్యయంలో ఈ పెరుగుదల 146 శాతంగా ఉంది. NSSO సాధారణంగా ఈ గణాంకాలను ప్రతి 5 సంవత్సరాలకు విడుదల చేస్తుంది. పదేళ్ల వ్యవధిలో ఈసారి ఈ గణాంకాలు వెలువడ్డాయి.

గ్రామీణ ప్రాంత పేదవాడి జీవితం రోజుకు కేవలం రూ.45 మాత్రమే.. NSSO సర్వేలో కీలక విషయాలు!
Poors In Village Expense

Updated on: Feb 25, 2024 | 3:39 PM

భారతదేశంలో ప్రజల ఖర్చు అలవాట్లు మారుతున్నాయి. దేశంలో గ్రామాల నుంచి నగరాల వరకు నిత్యావసర వస్తువులపై వ్యయం పెరుగుతోంది. ఉద్యోగులు, కార్మికుల సగటు నెలవారీ జీతం విషయంలో భారత్‌ చాలా దేశాల కంటే వెనుకబడిందని ‘నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO)’ సంస్థ పేర్కొంది. అయితే, నగరాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలకు రోజువారీ ఖర్చులు చాలా తక్కువ అని ఇటీవల నిర్వహించి సర్వేలో వెల్లడైంది. గ్రామంలోని పేదల జీవితం రోజుకు రూ.45 మాత్రమే ఖర్చు అవుతుండగా, నగరంలో నివసించే అత్యంత పేద వ్యక్తి రోజుకు రూ.67 ఖర్చు చేయగలుగుతున్నాడు.

నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO) ఇటీవల నెలవారీ సగటు తలసరి వినియోగదారు వ్యయం (MPCE) డేటాను విడుదల చేసింది. ఈ గణాంకాలు గృహ వినియోగ వ్యయ సర్వే 2022 23 (HCES)పై ఆధారపడి ఉన్నాయి. దీని ప్రకారం, గ్రామంలో అత్యల్ప స్థాయిలో నివసిస్తున్న 5 శాతం జనాభా సగటు నెలవారీ తలసరి వినియోగదారు వ్యయం రూ.1,373 మాత్రమే. దీని ప్రకారం, ఇది రోజుకు రూ.45 వరకు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడైంది. పట్టణ జనాభా డేటాను పరిశీలిస్తే, నగరాల్లో నివసిస్తున్న పేదలు 5 శాతం జనాభాలో ప్రతి వ్యక్తి సగటు నెలవారీ ఖర్చు రూ. 2001. రోజువారీ ప్రాతిపదికన, ఈ ఖర్చు దాదాపు రూ.67 వరకు వస్తుంది.

SCES ఫ్యాక్ట్ షీట్ ఆధారంగా, గ్రామాలు, నగరాల్లోని ధనవంతులలో టాప్ 5 శాతం ఉన్న వ్యక్తులతో పోల్చినట్లయితే, గ్రామంలో వారి తలసరి నెలవారీ సగటు వినియోగదారు వ్యయం రూ. 10,501 (రోజుకు రూ. 350). పట్టణ ప్రాంతాల్లోని టాప్ 5 శాతం ప్రజల సగటు నెలవారీ వినియోగదారు వ్యయం రూ. 20,824 (రోజుకు రూ. 695).

దేశంలో ప్రజల వినియోగ వ్యయం పెరుగుతోంది..

మొత్తం దేశ జనాభా సగటును పరిశీలిస్తే, 2011 12తో పోలిస్తే 2022 23 నాటికి వారి నెలవారీ వినియోగదారుల వ్యయం దాదాపు రెట్టింపు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుత ధరల ప్రకారం దేశంలోని కుటుంబాల తలసరి సగటు నెలవారీ గృహ వ్యయం 2022 23లో రూ.6,459గా ఉంటుందని అంచనా. కాగా 2011 12లో రూ.2,630. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దం క్రితం రూ.1,430గా ఉన్న రూ.3,773కి పెరిగింది.

ఈ వృద్ధిని పరిశీలిస్తే, గ్రామీణ జనాభా సగటు నెలవారీ గృహ వ్యయంలో 164 శాతం పెరుగుదల నమోదైంది. అయితే పట్టణ జనాభా వ్యయంలో ఈ పెరుగుదల 146 శాతంగా ఉంది. NSSO సాధారణంగా ఈ గణాంకాలను ప్రతి 5 సంవత్సరాలకు విడుదల చేస్తుంది. పదేళ్ల వ్యవధిలో ఈసారి ఈ గణాంకాలు వెలువడ్డాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…