Coronavirus: భారత్‌లో కోరలు చాస్తోన్న కరోనా మహమ్మారి – తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కేసులున్నాయంటే..?

దేశంలో కరోనా కేసులు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 10 మంది మరణించగా, మొత్తం కేసులు 7500లకు చేరువయ్యాయి. అత్యధికంగా కేరళ (2007), గుజరాత్ (1441), పశ్చిమ బెంగాల్ (747)లో కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కేసులు ఉన్నాయంటే..?

Coronavirus: భారత్‌లో కోరలు చాస్తోన్న కరోనా మహమ్మారి - తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కేసులున్నాయంటే..?
Corona

Updated on: Jun 15, 2025 | 9:29 PM

దేశంలో కరోనా కలవరం సృష్టిస్తోంది. రోజురోజుకు చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 7500లకు చేరువలో ఉన్నాయి. గడిచిన 24గంటల్లో 10మంది కొవిడ్‌తో చనిపోయారు. ఢిల్లీలో ముగ్గురు, కేరళలో ఐదుగురు, మహారాష్ట్రలో ఇద్దరు కరోనాతో మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటి వరకూ 97మంది కరోనా కాటుకు బలయ్యారు. అత్యధికంగా కేరళలో 28మంది, మహారాష్ట్రలో 27మంది, ఢిల్లీ, కర్నాటకలో 11మంది చొప్పున మరణించారు. తమిళనాడులోను 7మంది కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకూ దేశంలో 7383 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో 2007, గుజరాత్‌లో 1441, వెస్ట్‌ బెంగాల్‌ 747, ఢిల్లీ 682, మహారాష్ట్ర 578, కర్నాటక 573, తమిళనాడు 243, రాజస్థాన్‌ 192 అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.

ఇక తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌లో 101, తెలంగాణలో తొమ్మిది కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం.. 24గంటల్లో 212 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో ఢిల్లీ రెండోస్థానంలో ఉంది. కొవిడ్‌ కేసులకు కొత్త వేరియంట్‌ కారణమని భావిస్తున్నారు అధికారులు. వాటితో అంతగా ప్రమాదమేమీ లేదని.. గతంలో వేరియంట్ల తరహాలో ప్రాణాంతకం కావని పేర్కొన్నారు. అయితే, వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన చెందాల్సిన పని లేదని నిపుణులు పేర్కొంటున్నారు. జలుబుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో బాధపడుతున్న రోగులు వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకొని.. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..