India Coronavirus: మృత్యుఘోష.. కరోనాతో ఒక్కరోజే 2,102 మంది మృతి.. రికార్డు స్థాయిలో కేసులు..

|

Apr 22, 2021 | 8:50 AM

Covid-19 updates: దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డుస్థాయిలో కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి రెండు లక్షలకు

India Coronavirus: మృత్యుఘోష.. కరోనాతో ఒక్కరోజే 2,102 మంది మృతి.. రికార్డు స్థాయిలో కేసులు..
covid dead body
Follow us on

Covid-19 updates: దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డుస్థాయిలో కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి రెండు లక్షలకు పైగా నమోదవుతున్న కేసులు కాస్త.. మూడు లక్షల మార్క్ దాటింది. ఈ మహమ్మారి కారణంగా మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. గత 24 గంటల్లో బుధవారం కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా 2,102 మంది మరణించారు. దేశంలో కోవిడ్ ప్రారంభం నాటినుంచి అత్యధిక మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. దీంతోపాటు గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 3,15,925 కేసులు నమోదయ్యాయి. కేవలం 17 రోజుల్లోనే రోజువారి కేసులు లక్ష నుంచి 3 లక్షలకు చేరడం ఈ మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతోంది.

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ అలజడి సృష్టిస్తోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుండగానే.. మరోవైపు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ మేరకు పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. పలుచోట్ల ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితులు మరణిస్తున్నారు. మరోవైపు కరోనా చికిత్సలో అత్యవసరంగా ఉపయోగించే రెమిడెసివిర్ ఔషధం కొరత కూడా వేధిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఆక్సిజన్, ఔషధాల కొరత ఏర్పడకుండా నిరంతరం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సంప్రదించి కోవిడ్ నియంత్రణకు పలు సూచనలు చేస్తోంది.

దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఆ తరువాత ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పంజాబ్, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఏపీ, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం లాక్‌డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

Also Read:

Maharashtra : రేపటి నుంచి మహారాష్ట్రలో సంపూర్ణ లాక్‌డౌన్‌.. రాత్రి 8 గంటల నుంచి మే 1 వరకు ఎక్కడికక్కడ బంద్

Petrol Diesel price Today: ఏపీలోనే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?