India Corona Cases: దేశంలో కొత్తగా 15,223 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. బుధవారం 15,223 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య  1,06,10,883కి చేరింది. కొత్తగా మరో 151 మంది వైరస్ కారణంగా మరణించగా

India Corona Cases: దేశంలో కొత్తగా 15,223 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
Corona-Virus-India

Updated on: Jan 21, 2021 | 11:47 AM

India Corona Cases:  దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. బుధవారం 15,223 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య  1,06,10,883కి చేరింది. కొత్తగా మరో 151 మంది వైరస్ కారణంగా మరణించగా.. ఇప్పటి వరకు 1,52,869 మంది కోవిడ్ మహ్మమారి చంపేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,92,308 యాక్టివ్ కేసులున్నాయి. కాగా యాక్టివ్ కేసుల రేటు ఆ రేటు 1.86 శాతం తగ్గడం ఊరటనిచ్చే అంశం. బుధవారం 19,965 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం రికవరీల సంఖ్య 1,02,65,706కి చేరింది.  అలాగే దేశంలో జనవరి 20 నాటికి 18,93,47,782 వైరస్‌ నిర్ధారణ టస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

దేశంలో కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. దాదాపు ఏడాదిగా అతలాకుతలం చేసిన కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. కరోనా వ్యాక్సిన్‌ కోసం భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం తీవ్రంగా శ్రమించాయి. అయితే దేశంలో ఐదో రోజు కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. బుధవారం సాయంత్రం వరకు దేశంలో 7.86 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా వేసినట్లు మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Also Read : AP local Body Polls: ఏపీ సర్కార్‌కు చుక్కెదురు.. పంచాయితీ ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు ఆదేశం