గుట్టుచప్పుడు కాకుండా వెళ్తున్న ఫిషింగ్‌ బోట్లు.. భారత్-శ్రీలంక నేవీ సంయుక్త ఆపరేషన్‌‌లో బయటపడ్డ నిజాలు..!

|

Nov 29, 2024 | 3:15 PM

దేశ వ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి వినియోగం విచ్చలవిడిగా పెరుగుతోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

గుట్టుచప్పుడు కాకుండా వెళ్తున్న ఫిషింగ్‌ బోట్లు.. భారత్-శ్రీలంక నేవీ సంయుక్త ఆపరేషన్‌‌లో బయటపడ్డ నిజాలు..!
Drugs Seizes Navy
Follow us on

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో ప్రభుత్వం మరో భారీ విజయాన్ని సాధించింది. దేశ వ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి వినియోగం విచ్చలవిడిగా పెరుగుతోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. డగ్స్‌పై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి ఉక్కుపాదం మోపాలని సూచించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న ఎయిర్‌పోర్టులు, ఓడరేవులను కస్టమ్స్ అధికారులు, నార్కొటిక్ బ్యూరో అధికారులు నిత్యం జల్లెడ పడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీలు, కంటైనర్లను క్లియర్‌గా చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీలంక నేవీతో కలిసి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది ఇండియన్ నేవీ. కొందరు ఫిషింగ్ బోట్‌లో డగ్స్ తరలిస్తుండగా.. వారిని చాకచక్యంగా ఇండియన్ నేవీ అదుపులోకి తీసుకుని వారి నుంచి 500 కిలోల డగ్స్‌ను స్వాధీనం చేసుకుంది.

ఇక ఇటీవల భారత తీర రక్షక దళం 6000 కిలోల నిషేధిత మెథాంఫెటమైన్‌ను తీసుకువెళుతున్న ఓడను స్వాధీనం చేసుకుంది. అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో ఆరుగురు మయన్మార్ జాతీయులను పెద్ద యాంటీ నార్కోటిక్ ఆపరేషన్‌లో అరెస్టు చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఒక్కోటి రెండు కిలోల బరువున్న దాదాపు 3000 ప్యాకెట్లలో ఈ డ్రగ్‌ను ప్యాక్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటివరకు దేశంలో పట్టుబడిన డ్రగ్స్‌లో ఇదే అతిపెద్దది. గతంలో గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌లో 2021 సెప్టెంబర్‌లో 3,000 కిలోల హెరాయిన్ పట్టుబడింది.

నవంబర్ 14న, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, నేవీ మరియు గుజరాత్ ATS సంయుక్త ఆపరేషన్‌లో, గుజరాత్ సమీపంలోని అంతర్జాతీయ జలాల నుండి 700 కిలోల మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకుని, ఎనిమిది మంది ఇరాన్ పౌరులను అరెస్టు చేసింది. ఇది కాకుండా ఢిల్లీలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదే రోజు సుమారు రూ.900 కోట్ల విలువైన 82.53 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకుంది.

కోస్ట్ గార్డ్ డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ పైలట్, నవంబర్ 23న సాధారణ పెట్రోలింగ్‌లో ఉండగా, బారెన్ ద్వీపం సమీపంలో ఒక ఫిషింగ్ ఓడ అనుమానాస్పద కార్యాచరణను గమనించినట్లు రక్షణ అధికారి తెలిపారు. బారన్ ఐలాండ్ పోర్ట్ బ్లెయిర్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓడను హెచ్చరించి వేగాన్ని తగ్గించాలని కోరారు. ఇంతలో పైలట్ దీనిపై అండమాన్ నికోబార్ కమాండ్ కు సమాచారం అందించాడు. వెంటనే మా సమీప పెట్రోలింగ్ ఓడలు బారెన్ ద్వీపం వైపు వెళ్లాయని, తదుపరి విచారణ కోసం నవంబర్ 24న ఫిషింగ్ ఓడను పోర్ట్ బ్లెయిర్‌కు తీసుకెళ్లామని అధికారి తెలిపారు. ఓడలో ఉన్న ఆరుగురు మయన్మార్ జాతీయులను అరెస్టు చేశారు.

మెథాంఫేటమిన్ భారతదేశం దాని పొరుగు దేశాలలోకి అక్రమంగా రవాణా చేయడం జరుగుతోంది. సంయుక్త విచారణ కోసం అండమాన్ నికోబార్ పోలీసులకు సమాచారం అందించారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని భారత జలాల్లో ఇలాంటి నిషిద్ధ వస్తువులు పట్టుబడడం ఇదే మొదటిసారి కాదు. 2019, 2022లో భారత జలాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన విదేశీ నౌకల నుంచి ఇలాంటి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..